యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్.1 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విద్యార్థులుగా పిలవబడే రౌడీలకు ఒక నాయకుడిగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. రజనీకాంత్, చిరంజీవి లాంటి ఉత్తమ నటులకు నటనను నేర్పించిన దేవదాసు కనకాల కుమారుడైన రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో నటించాడు.


ముఖ్యంగా ఆది, నాగ, అశోక్, యమదొంగ, బాద్ షా, జనతా గ్యారేజ్ లో రాజీవ్ కనకాల చూపించిన అద్భుతమైన నటన అతనిని బాగా పాపులర్ చేసింది. అయితే, ఈ సినిమాలన్నీ తీసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో మీరు చేసినటువంటి సినిమాలలో మీకు బాగా గుర్తిండిపోయే సినిమా ఏంటని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాలని ప్రశ్నించగా.. అతడు ఎన్నో నిజాలను బయట పెట్టాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, తాను చనిపోయే వాళ్లమని కూడా చెప్పి అందర్నీ షాక్ కి గురి చేశాడు.


రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "నాగ సినిమా చేసేటప్పుడు మేమిద్దరం చనిపోయే వాళ్ళం. కానీ అదృష్టవశాత్తు బతికిపోయాం. నాగ సినిమా క్లైమాక్స్ లో ట్రయిన్ పైన తారక్, నేను ఫైట్ సీన్ చేయాల్సి ఉంది. అప్పుడు రైలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. నేను ట్రైన్ పైకి ఎక్కి జూనియర్ ఎన్టీఆర్ తో దెబ్బలడాను. ఆ సమయంలో ట్రైను కదలడం, ఇంకా గాలి బలంగా వీస్తుండటంతో.. ఇద్దరం పట్టు తప్పి కింద పడి పోయే వాళ్ళం. కానీ దేవుడి దయవల్ల మేము వెంటనే జాగ్రత్తపడి రైలు పైనున్న అంచులను గట్టిగా పట్టుకున్నాం. ఈ భయంకరమైన సంఘటన వలన నాగ సినిమా నా జీవితంలో ఇప్పటికీ గుర్తుండి పోతుంది", అని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: