తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఈశ్వర్’ లాంటి మాస్ సినిమాతో రెబల్ స్టార్ కృష్టం రాజు తమ్ముడు కొడుకు ప్రభాస్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ మూవీలో అచ్చం పెద్ద నాన్నలాగే డైలాగ్స్ కొట్టడం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోారు.  మంచి హైట్ పర్సనాలిటీ, అందం అన్న కలగలిపిన ప్రభాస్ నటించిన తర్వాత చిత్రాలు పెద్దగా విజయం సాధించకున్నా.. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’ సూపర్ హిట్ అయ్యింది.  అప్పటి నుంచి ప్రభాస్ దశ తిరిగిపోయింది.  తర్వాత మిర్చి, డార్లింగ్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు.  ఇక రాజమౌళి  తీసిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాల  కోసం ఐదు సంవత్సరాలు ఎలాంటి చిత్రాల్లో నటించకుండా తన పూర్తి సమయం వెచ్చించారు. 

 

అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎంతో వత్తిడి వచ్చినా.. తన డెడికేషన్ మొత్తం బాహుబలి కోసం ఉంచారు.  అయితే ప్రభాస్ ఎంత డెడికేషన్ చేశారు.. అంత గొప్ప రిజల్ట్ పొందారు.  ఈ మూవీ జాతీయ స్థాయిలో ఓ సంచనలం సృష్టించింది.  ఇక టాలీవుడ్ స్థాయిని ఏకంగా ప్రపంచానికి చాటి చెప్పింది.  అప్పటి నుంచి ప్రభాస్ నటించే ప్రతి చిత్రం పై ప్రత్యేక ఫోకస్ పడింది.  ఈ నేపథ్యంలోనే గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో  ప్రభాస్ నటించిన ‘సాహెూ’ మూవీ రిలీజ్ అయ్యింది.  అయితే ఇందులో ఇతర భాష నటుల ఫ్లేవర్ ఎక్కువగా ఉండటంతో టాలీవుడ్ లో పెద్దగా విజయం సాధించలేదు.  భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఘోరమైన వ్యూస్, రేటింగ్ పడింది.  మొత్తానికి సాహో రిజల్ట్ చూసిన తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

తాజాగా ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణంరాజు ఒక భాగస్వామిగా వున్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచీ 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు తాజాగా 'ఓ డియర్' .. 'రాధేశ్యామ్' అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసమే ఈ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించి వుంటారా? అనే విషయం స్పష్టంగా తెలియదు. ఈ రోజు శర్వానంద్, సమంత నటించిన జాను మూవీ రిలీజ్ అయ్యింది.  పేరు దగ్గరగా ఉండటం ఒక కారణం అయ్యి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసమే ఆ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: