టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరు నితిన్. జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తర్వాత దిల్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ మద్య గుండెజారిఘల్లంతయ్యిందే, ఇష్క్ చిత్రాలు మంచి విజయం అందుకున్నాడు. తర్వాత మళ్లీ అదే పరిస్థితి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత నటించిన అ.. ఆ మంచి విజయం అందుకుంది. అప్పటి నుంచి మంచి విజయం కోసం మల్లీ ఎదరు చూసే పరిస్థితి వచ్చింది. కాకపోతే నితిన్ కి హిట్.. ప్లాప్స్ అనే తేడా లేకుండా తన కెరీర్ సాఫీగానే కొనసాగిస్తున్నారు. ఈ మద్య నితిన్ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో ఈ కుర్ర హీరో తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు సంకేతాలు పంపారు. షాలిని అనే అమ్మాయిని నితిన్ దాదాపు నాలుగేళ్లుగా ఇష్టపడుతున్నారట. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారూ ఒప్పేసుకున్నారు. దాంతో ఇదే ఏడాది పెళ్లి చేసేయాలని నిర్ణయించేసుకున్నారు. పెళ్లి ఏప్రిల్ 15న జరగనున్నట్లు గత కొంత కాలంగా తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పెళ్లి వాయిదా పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్ నితిన్ పెళ్లికి వేదిక కాబోతోందట. ఇప్పటికే ఇంట్లో వారు అన్ని ఏర్పాట్లు చేసేశారట. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ తో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల చిత్రానికి దర్శకత్వం వహిస్తు్న్నారు. అంతే కాదు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. అయితే ఈ విషయంపై అఫిషియల్ గా ప్రకటన వస్తే కానీ అసలు నిజం తెలియదు అంటున్నారు అభిమానులు.