శ్రియ శరన్ 37 సంవత్సరాల వయసు దాటిపోతున్నా ఆమె తనలో గ్లామర్ తగ్గలేదు అన్న సంకేతాలు ఇస్తూ తరుచూ ఆమె అనేక ఫ్యాషన్ మ్యాగజైన్స్ కు హాట్ ఫోటో షూట్ ఇస్తోంది. వాస్తవానికి ఆమె సినిమాలలో నటించడానికి ఇంకా ఉత్సాహం చూపుతున్నా టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలు మాత్రం పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. 


వాస్తవానికి చిరంజీవి కొరటాల మూవీలో అదేవిధంగా బాలయ్య బోయపాటిల మూవీలో వెంకటేష్ ‘అసురన్’ రీమేక్ లో ఈమెకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచనలు వచ్చినా ఈ టాప్ హీరోలు అంతా శ్రియ బదులు మరొక హీరోయిన్ ను పెట్టమని అడగడంతో శ్రియ కు అవకాశాలు ఆమె గడప వరకు వచ్చి ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఆమెను ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడం లేదు. 


దీనితో ఇక లాభం లేదు అనుకుని కాబోలు శ్రియ తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ మరో ఫోటో షూట్ ఇచ్చింది. డిజైనర్ వేర్ ఆఫ్ సారీ తో ఉన్న ఈ ఫోటో షూట్ లోని ఆమె గ్లామర్ అందర్నీ ఆకర్షిస్తూ తనకు ఇంకా గ్లామర్ తగ్గలేదు అన్న సంకేతాలు ఇస్తోంది. వాస్తవానికి వెంకటేష్ తో నటించవలసిన ‘అసురన్’ రీమేక్ లో శ్రియ స్థానాన్ని ప్రియమణి భర్తీ చేయడంతో శ్రియ తన గ్లామర్ చూపించుకోవడానికి ఇలాంటి ఫోటో షూట్ ఇచ్చింది అనుకోవాలి.


అనూహ్యంగా ఈమెను రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ లో అజయ్ దేవగన్ భార్యగా కీలక పాత్రకు ఎంపిక చేసిన పరిస్థితులలో మళ్ళీ మరొకసారి శ్రియమూవీ ద్వారా నేషనల్ సెలెబ్రెటీగా మారబోతోంది. మంచి డాన్సర్ గా కూడ పేరున్న ఈమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో మన సీనియర్ హీరోలు తమ మనసు మార్చుకుని ఆలోచిస్తే వారికి ఇప్పుడు ఎదురవుతున్న హీరోయిన్స్ సమస్యకు పరిష్కార మార్గం లభించే ఆస్కారం ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: