ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ ఇలియానా ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉంది. బాలీవుడ్‌ మీద ఆశలతో సౌత్‌ సినిమాను నిర్ణక్ష్యం చేసిన ఈ బ్యూటీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవటంతో కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా అవి సక్సెస్‌లు కాకపోవటంతో సరైన బ్రేక్‌ దొరకటం లేదు. దీంతో అమ్మడు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

 

ఇక పర్సనల్‌ లైఫ్‌ విషయంలో ఇలియానా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్ల పాటు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారన్న వార్తలు వినిపించాయి. ఇలియానా కూడా అలాంటి హింట్స్‌ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది. కానీ అందరికీ షాక్‌ ఇస్తూ తామిద్దరం విడిపోయామంటూ ప్రకటించింది ఇల్లీ బేబి.

 

బ్రేకప్‌కు కారణాలు అధికారికంగా వెల్లడించకపోయినా కెరీర్ పరంగా ఎదురవుతున్న సమస్యల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలియానా మరోసారి ప్రేమలో పడినట్టుగా చెపుతోంది. తన ఇన్‌స్టా స్లోరిలో మళ్లీ ప్రేమలో పడ్డట్టుగా అనిపిస్తుంది అంటూ పోస్ట్‌ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది ఇలియానా.

 

అయితే ఈ అందాల భామ ప్రేమలో పడింది అబ్బాయితో కాదు. తాను పెంచుకుంటున్న కుక్కపిల్లతో. ఇటీవల ఇలియానా సైబీరియన్‌ హస్కీ జాతికి చెందిన కుక్క పిల్లను తెచ్చుకుంది. దాంతో సరదాగా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరిలో పోస్ట్ చేసిన ఇలియానా తాను ప్రేమలో పడ్డానంటూ కామెంట్ చేసింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కైనా తరువాత అసలు విషయం తెలుసుకొని నవ్వుకున్నారు. ఇటీవల తెలుగులో అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమా చేసిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో ది బిగ్‌ బుల్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: