పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఈ వారమంత రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. చాలా కాలం విరామం తరువాత సినిమాలకు ఓకె చెప్పిన పవన్‌, జెట్ స్పీడుతో షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు. ఇప్పటికే రీ ఎంట్రీ సినిమా పింక్‌ రీమేక్‌ను పవన్‌ పూర్తి చేశాడన్న టాక్‌ వినిపిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్‌గా నటిస్తున్నాడు. హిందీ, తమిళ భాషల్లో సక్సెస్‌ అయిన ఈ కథ తెలుగులోనూ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.


ఒక వైపు షూటింగ్‌లు చేస్తూనే రాజకీయ సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు పవన్‌. 6,7 తారీఖుల్లో కర్నూలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాడు పవన్‌. పార్టీ నేతలకు భవిష్యత్తు కార్యాచరణ విషయంలో దిశానిర్ధేశం చేశాడు. రాజకీయంగా చేయాల్సిన కార్యక్రమాలపై కూడా కార్యకర్తలతో, పార్టీ నేతలతో చర్చించాడు. సినిమాలు చేస్తూనే రాజకీయానాయకుడిగానూ కొనసాగుతున్నాడు పవన్‌. బీజేపీతో కలిసి పలు పోరాటలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాడు.


ఇక ఈ వారం పవన్‌ న్యూ లుక్‌లో అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. గత రెండేళ్లుగా గెడ్డంతోనే కనిపిస్తున్న పవన్‌, కర్నూలు సమావేశానికి క్లీన్‌ షేవ్‌లో వచ్చాడు. అయితే పవన్‌ లుక్‌ మార్పు ఎందుకు అన్న విషయం అధికారికంగా వెల్లడించకపోయినా సినిమాల కోసమే పవన్‌ ఇలా కొత్త లుక్‌లోకి వచ్చాడన్న టాక్ వినిపించింది. అయితే అభిమానులు మాత్రమే పవన్‌ న్యూ లుక్‌ చూసి పండుగ చేసుకుంటున్నారు.


పింక్‌ రీమేక్‌ షూటింగ్తో పాటు ఆ తరువాత చేయబోయే సినిమాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొన్నాడు పవన్‌. వకీల్ సాబ్‌ పేరుతో తెరకెక్కుతున్న పింక్ రీమేక్‌ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ డ్రామా చేయనున్నాడు. ఆ సినిమా తరువాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు పవన్‌. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఈ వారంలో జరిగినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: