తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తి చేసిన సినిమా ‘బాహుబలి’. ఒకే కథను  రెండు భాగాలుగా తెరకెక్కించడమే ఓ సాహసం. ఆ సాహసంతోనే ‘బాహుబలి’.. ది బిగినింగ్’ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానిపై ఆసక్తి రేకెత్తించేలా చేసి.. సెకండ్ పార్ట్ ‘బాహుబలి.. ది కంక్లూజన్’ పై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో  అంచనాలు పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు రాజమౌళి. అంతేకాదు ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర అపూర్వ విజయాన్ని అందుకున్నాడు.

 

 

2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 1800 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా.. ఆ సినిమా రికార్డును తెలుగుతో పాటు హిందీలో ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది. ఈ విషయాన్ని అప్పట్లో బాలీవుడ్ సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ పది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా కేవలం హిందీలోనే  రూ. 300 కోట్లు రాబట్టింది. నేటికీ ఆ రికార్డు ఎవరు క్రాస్ చేయలేకపోయారు.

 

 

బాహుబ‌లి ముందు, తరువాత అన్న మాదిరి తయారయ్యింది తెలుగు సినీ పరిశ్రమ.. అవును... వరుస హిట్లుతో ఇండియాలో మిగిలిన సినీ పరిశ్రమలకు నిద్రలేకుండా చేస్తోంది.. రేసెంటుగా రీజ‌న‌ల్ లాంగ్వేజ్తో కూడా ఏకంగా రు.200 - 250 కోట్లు కొట్టిన అల‌ వైకుంఠపురంలో, స‌రిలేరు నీకెవ్వరు సినిమాలు చూసి, ఒక‌ప్పుడు మేం గొప్ప అన్న‌ట్టుగా ఉండే, హిందీ, త‌మిళులు.. అవాక్కవుతున్నారు.

 

 

బాహుబలి ఇన్సిపిరేషన్‌తో సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా వందల కోట్లతో సినిమాలు నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే.. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించటం ఇదే తొలిసారేం కాదు. బాహుబలి కన్నా చాలా ముందు, ముప్పై ఏళ్ల క్రితమే రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించింది.. అని పలువురు తెలుగు సినీ ప్రముఖులు గర్వంగా చెబుతూ వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: