బాలీవుడ్ లో ఈ మద్య చారిత్రాత్మక, బయోపిక్ చిత్రాలు బాగానే వస్తున్నాయి.  అయితే ఇలాంటి చిత్రాలు తెరకెక్కిస్తున్నప్పుడు కొన్ని విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.  రియలిస్టిక్ అంటూనే అభూత కల్పన సృష్టిస్తున్నారని.. అన్నీ కల్పితాలే తెరపై చూపిస్తున్నారని అంటున్నారు.  ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ తీసిన పద్మావత్ మూవీ దేశ వ్యాప్తంగా ఎంత గందరగోళం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారు.  ఆ తర్వాత కంగనా రౌనత్ నటించిన మణికర్ణిక మూవీపై ఎన్నో ఆంక్షాలు వెలుబుచ్చారు. ఒక వర్గం వారు ఝాన్సీ రాణి ని వేరే రకంగా చూపిస్తున్నారని.. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉండబోతుందని పెద్ద ఎత్తన నిరసనలు తెలిపారు. 

 

కానీ ఈ మూవీ రిలీజ్ తర్వాత మరోసారి తప్పు చేశామన బాధపడ్డారు.  అయితే ఇలాంటి రియల్టీ మూవీస్ పై విమర్శలు రావడం తర్వాత కాంప్రమైజ్ కావడం కామన్ అయ్యింది.  బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలకే క్రేజ్ ఏర్పడుతుంది.  తాజాగా కశ్మీర్‌లో గతంలో పండిట్ కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా ‘శిఖర’ అనే చిత్రం తీశారు. తాజాగా ఈ చిత్రం చూస్తూ భావోద్వేగానికి గురైన ఓ యువతి.. దర్శకుడిపై విరుచుకుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.  కశ్మీర్ పండిత్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇటీవల ఢిల్లీలోని ఓ థియేటర్‌ ఈ చిత్రం చూడడానికి వెళ్లింది. అదే చిత్రం థియేటర్‌లో దర్శకుడు వినోద్ చోప్రా కూడా కూర్చొని చిత్రం చూస్తున్నారు. 

 

ఉన్నట్టుండి ఓ యువతి లేచి దర్శకుడిపై తిట్ల దండకం మొదలు పెట్టింది.  ఈ చిత్రం డబ్బు కోసమే తీశారని, 1990లో కశ్మీర్ పండిట్లు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవడానికి గల కారణాలను చూపలేదని అరుస్తూ చెప్పింది. సామూహిక అత్యాచారాలు, హత్యల గురించి చూపలేదని వాపోయింది.   ఓ వర్గానికి అనుకూలంగా ఈ చిత్రం తీసినట్లు ఉందని ఆరోపించింది. ఇలాగేనా సినిమా తీసేది? అంటూ నిలదీసి, ఆ తర్వాత తన సీటులో కూర్చొని కన్నీరు పెట్టుకుంది. తాజాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: