టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేరు రాజమౌళి. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ ఒక్క ఫ్లాప్‌ కూడా లేని రాజమౌళి, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చాడు. బాలీవుడ్ దర్శకులు కూడా సాధ్యం కానీ ఎన్నో రికార్డ్‌లను తన ఖాతాలో వేసుకున్న ఈ సినీ జక్కన్నకు ఓ చెడ్డ పేరు కూడా ఉంది. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా ఆ హీరో కెరీర్ గాడి తప్పుతోంది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

 

రాజమౌళి తన సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాడు. ప్రతీ సీన్‌లోనూ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసి ఆ మాస్‌ ఆడియన్స్‌లో ఆ హీరోను శిఖరాగ్రాన నిలబెడతాడు. ఒక్క సినిమాతో ఇమేజ్‌ తారా స్థాయికి చేరటంతో తరువాత ఆ స్థాయి ఆ హీరోలు నిలబెట్టుకోలేకపోతున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోలుగా నటించిన హీరోలందరూ ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమా తరువాత సుబ్బు సినిమాతో ఫ్లాప్‌ ఎదుర్కొన్నాడు.

 

సింహాద్రి సినిమా తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. సై సినిమా తరువాత నితిన్‌, ఛత్రపతి తరువాత ప్రభాస్‌, విక్రమార్కుడు తరువాత రవితేజలు కూడా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడ్డారు. మర్యాద రామన్న సినిమా తరువాత సునీల్‌ కెరీర్‌ కూడా కష్టాల్లో పడింది.

 

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత ప్రభాస్‌ కూడా ఇబ్బంది పడ్డాడు. జాతీయ స్థాయిలో తెరకెక్కించిన సాహో సినిమా వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా సూపర్‌ హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల అభిమానులను కూడా ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌లో ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ను ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: