రాజమౌళి... పరిచయం అక్కర్లేని పేరు. పరిశోధన చేయనవసరం లేని టాపిక్. చిన్న పిల్లలనుండి, పెద్దలవరకు ఎవ్వరినడిగినా.. ఒక్కటే మాట చెబుతారు. తెలుగు సినీ దర్శక ధీరుడని. కథా,స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచే విధానం .. పాటలు .. ఫైట్ సీన్స్ షూట్ చేసే విషయంలో రాజమౌళి శైలి ప్రత్యేకం. ఈయన స్టూడెంట్ నంబర్ 1 అనే సినిమా తీస్తే అప్పడు అంతా కలిసి ఆ క్రెడిట్ వేరొక డైరెక్టర్‌కి కట్టబెట్టారు. రాజమౌళిని చులకనగా చూసారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకు తెలియదు ఫ్యూచర్‌లో ఇదే పేరు ఇండియన్ సినిమాకే తలమానికంగా నిలుస్తుంది అని!

 

అతను ఏం చెయ్యగలడు అని మాటల్లో చెప్పడు. అతను చెయ్యాలనుకున్నది, కలగన్నది ఎంత కష్టమయినా, అసాధ్యం అయినా కూడా సాధించి తీరతాడు. అందుకే అతన్ని పొగడడానికి దర్శక ధీరుడు, దర్శక బాహుబలి, ఆల్ టైమ్ గ్రేట్ డైరెక్టర్ లాంటి పదాలు కూడా సరితూగగలవా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తనని తానే దాటి గెలవాలి అనే కసి, కొత్తగా ఎదో నేర్చుకోవాలి అనే ఆరాటం, ఆ నేర్చుకున్న దానితో అద్భుతాలు సృష్టించాలి అనే పోరాటం. అందుకే రాజమౌళి మెదడులో ఈగ,మగధీర, బాహుబలి లాంటి కళాఖండాలు పురుడుపోసుకున్నాయి. 

 

రాజమౌళి తీసిన బాహుబలి...ఈ ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అనే పరిస్థితి వచ్చింది. బాహుబలి సిరీస్‌లోని రెండు సినిమాలతో ప్రేక్షకుల మనస్సులలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు జక్కన్న. అతను పడిన అయిదేళ్ళ అలుపెరగని శ్రమ వల్ల వందేళ్ళ తరువాత చూసిన కూడా క్లాసిక్ అనదగ్గ బాహుబలి మనకు దక్కింది.

 

అయితే వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళికి ఈ మధ్య ఓ పేరొందిన జ్యోతిస్యుడు షాక్ ఇచ్చాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమంటే.. వరుస విజయాలను నమోదు చేస్తున్న మన జక్కన్నకి ఈసారి బ్రేక్ పడుతుందనేది అతని జోస్యం. అయితే అతని అభిమానులు మాత్రం "ఎవరో చెప్పిన జోస్యం మా జక్కన్న స్పీడును ఆపలేదు!" అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. కాలం ఏం సమాధానం చెబుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: