తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాదు.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు.  అయితే రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యాక చాలా తక్కువ చిత్రాల్లో నటించారు. ఇక ఈ హీరో నటించిన చిత్రాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  గత ఏడాది బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్, కైరా అద్వాని నటించిన ‘వినయ విధేయ రామ’ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.

 

అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఓ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ మూవీ దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు, మాఫియా గురించి వెలుగులోకి తీసుకు వచ్చే పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు సమాచారం.  అయితే ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం చిత్రీకరణ 70 శాతం వరకూ పూర్తి చేసుకుంది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తయ్యాక.. కొరటాల - చిరంజీవి కాంబినేషన్లోని సినిమా కోసం చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 

 

ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చరణ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరంజీవి పాత్ర యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ పాత్ర ఏమిటా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ఆయన ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. రామ్ చరణ్ తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం టాక్ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: