ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. సినిమారంగంలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి తారలు కదలి వచ్చారు.  92వ అకాడమీ అవార్డల పేరుతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని అమెరికా లాస్ ఎంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు.  దక్షిణ కొరియాకు చెందిన ఇంగ్లీష్ యేతర మూవీ ‘పారాసైట్’ విజేతగా నిలిచింది. ఆస్కార్ చరిత్రలో ఓ విదేశీ సినిమా ఉత్తమ మూవీగా నిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాకుండా మరో మూడు విభాగాల్లో కూడా ‘పారాసైట్’ అవార్డులను దక్కించుకొంది.

 

ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన జోకర్ సినిమాలో నటనకుగానూ ప్రధాన పాత్ర పోషించిన జాక్విన్‌ ఫొనిక్స్‌‌కు ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న కిరాతకమైన కామిక్ క్యారెక్టర్ జోకర్.  ప్రాణాలు క్షణాల్లో హరించే పాత్రల జోకర్.. అయితే  ఈ జోకర్ ఎవరు? ఎందుకిలా మారాడు? ఏం సాధించాలనుకుంటున్నాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానంగా 2019లో వచ్చిన మూవీ ‘జోకర్’. సూపర్‌హీరో బ్యాట్‌‌మాన్ గురించి పెద్దగా ప్రస్తావించకుండా కేవలం అతని ప్రధాన శత్రువైన జోకర్ పాత్ర  తెరకెక్కింది.  

 

ఓ పాత్రకు ఆస్కార్ రావడం ఇది రెండోసారి. హాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన 'గాడ్ ఫాదర్' సిరీస్ లో వీటో క్లారియన్ పాత్రకు రెండుసార్లు ఆస్కార్ వచ్చింది.  'ది గాడ్ ఫాదర్'లో వీటో క్లారియన్ పాత్ర పోషించిన మార్లిన్ బ్రాండో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. తర్వాత 'ది గాడ్ ఫాదర్' సిరీస్ లో రెండో సినిమాలో వీటో పాత్ర పోషించిన రాబర్ట్ డి నీరో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. 'జోకర్' విషయానికి వస్తే... 'బ్యాట్ మ్యాన్: డార్క్ నైట్'లో జోకర్ పాత్ర పోషించిన హీత్ లెడ్జెర్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. అందులో ఆ పాత్రను బేస్ చేసుకుని 'జోకర్' సినిమా వచ్చింది. ఈసారి జోకర్ పాత్ర పోషించిన జాక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: