తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ సినిమా తొలి భాగం సంచలన విజయం సాధించగా, రెండో భాగం మరే ఇండియన్‌ సినిమాకు  సాధ్యం కానీ అద్భుత రికార్డ్‌ లను సృష్టించింది. ప్రపంచవ్యాప్తం గా దాదాపు 1800 కోట్ల వసూళ్లు సాధించి ఆ ఘనత తొలి భారతీయ చిత్రం గా చరిత్ర సృష్టించింది బాహుబలి 2. దీంతో రాజమౌళి రేంజ్‌ తారా స్థాయికి చేరింది.

 

అయితే ఇన్ని రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌ 350 కోట్లు మాత్రమే. అయితే అప్పటికి అది పెద్ద మొత్తమే అయినా బాహుబలి 2 సృష్టించిన రికార్డ్‌ లతో పోలిస్తే అది ఏమంత పెద్ద విషయం కాదు. అయితే బాహుబలి తన తదుపరి చిత్రంలో వెంటనే చెరిపేస్తున్నాడు రాజమౌళి.

 

బాహుబలి 2 లో కేవలం 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేయగా రాజమౌళి ఆర్ఆర్ఆర్‌కు 550 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ సినిమాను బాలీవుడ్‌ లోనే 150 కోట్లకు అమ్మెందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు. 100 కోట్లకు ఇప్పటికే పలు నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్‌ రాగా.. నిర్మాతలు మాత్రం 150 కోట్లు అయితే ఇస్తారని భావిస్తున్నారు.

 

రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలు గా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన అలియ భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది జూలైలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను 2021 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: