టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ల సినిమాలు క్రియేట్ చేసే హైప్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలకు సంబంధించిన సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీరి ముగ్గురు చేస్తున్న సినిమాలు వేరే అయినా టైటిల్స్, క్యారెక్టర్స్ లో ఓ పోలిక కనబడుతోంది. ఇది యాదృచ్ఛికమే అయినా అవన్నీ ఈ ముగ్గురి సినిమాలకే జరగడం ఆసక్తి కలిగిస్తోంది.

 

 

చిరంజీవి గతేడాది సైరాలో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక క్రిష్ తో చేస్తున్న సినిమాలో పవన్ కల్యాణ్ తెలంగాణకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పండుగ సాయన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ మరో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. ఈ మూడింటి సరళి చేస్తే కొణిదెల ఇంటి హీరోలు ముగ్గురూ ఒకే జోనర్ పాత్రలు చేస్తున్నారని అనుకోవాలి. వీటిలో చిరంజీవి సైరా గతేడాది విడుదలకాగా పవన్. చరణ్ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

 

 

ఇక టైటిల్స్ పరంగా చూస్తే.. ప్రస్తుతం వీరు ముగ్గురూ చేస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాకు ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇది అచ్చ తెలుగు టైటిల్. పింక్ రీమేక్ చేస్తున్న పవన్ సినిమాకు వకీల్ సాబ్ అనుకుంటున్నారు. ఇంది హిందీ టైటిల్. రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు ఆర్ఆర్ఆర్ టైటిల్ ఉంది. ఇది పూర్తిగా ఇంగ్లీష్ టైటిల్. ఇలా చూస్తే ఈ ముగ్గురు ‘మెగా’ స్టార్ హీరోల క్యారెక్టర్లే కాదు.. టైటిల్స్ కూడా మ్యాజికల్ గా కుదరడం విశేషమే. ఈ సినిమాల టైటిల్స్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఆసక్తి రేకెత్తిస్తున్నాయనడంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: