ఎన్టీఆర్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఎన్టీఆర్ సినిమాలు భారీ స్థాయిలో విజయం సాధిస్తూ వస్తుంటాయి.  రామాయణం సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన మొదటి సినిమా నిన్ని చూడాలని సినిమా పెద్దగా విజయం సాధించలేదు.  ఇది మొదటి సినిమా అయినప్పటికీ అధికారికంగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో అఫీషియల్ గా లాంచ్ అయినట్టుగా ప్రకటించారు.  ఆ తరువాత మాస్ హీరోగా ఎన్టీఆర్ రాణించారు.  

 


స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆది వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి.  ఆ తరువాత యమదొంగ సినిమాతో మరలా లైన్లోకి వచ్చారు.  అప్పటి నుంచి మరలా హిట్ కొడుతూ వచ్చిన ఎన్టీఆర్ కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు.  టెంపర్ సినిమాకు ముందు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్టీఆర్సినిమా తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 
టెంపర్, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, అరవింద సమేత వంటి సినిమాలు మెగా హిట్ కొట్టాయి.  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఎన్టీఆర్ సినిమాలు ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు చూస్తారు.  దీనికి మూడు కారణాలు ఉన్నాయి.  అందులో మొదటి కారణం ఒకటి ఉన్నది.  అదేమంటే, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి.  ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  


ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పగల సమర్ధుడు ఎన్టీఆర్.  కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ ఏవైనా సరే అద్భుతంగా పలికించగలడు.  దీంతో పాటుగా ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా అద్భుతంగా చేయగల సమర్ధుడు.  అందుకే అయన సినిమాలు అలా ఉంటాయి.  ఎలాంటి డ్యాన్స్ అయినా సరే అయన యిట్టె చేయగల సమర్ధుడు.  వీటితో పాటుగా ఎన్టీఆర్ యాక్షన్ పార్ట్ కూడా అద్భుతంగా చేయగలుగుతాడు.  అందుకే ఎన్టీఆర్ సినిమాలు అలా ఉంటాయని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: