ప్రస్తుత కాలంలో వస్తున్న ప్రతి చిత్రంలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇలాంటి సినిమాల వల్ల కూడా యువత చెడుకు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాల ప్రభావం యువత మీద ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదెందుకు అని అనుకుంటున్నారా..?? వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 15,18,24 లలో ప్రేమ దాని పర్యవసరం మీద దర్శకుడు మాడుపురి కిరణ్ కుమార్  ‘15-18-24 లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 

 

అయితే.. యూత్‌ ఫుల్ ఎంటర్‌ టైనర్ ‘15-18-24 లవ్ స్టోరీ’. మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాల పై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ దేవాదుల‌, కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ ని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా విడుదల చేశారు. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

 

 

అయితే, మెహ్రీన్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతోంది. పోస్టర్‌ తోనే యువతను ఆకర్షించడానికి హీరోయిన్‌ ను టాప్‌ లెస్‌ గా చూపించేశారు. మొత్తం మూడు జంటలను పోస్టర్‌ లో చూపించిన చిత్ర యూనిట్.. ఒక జంటను టాప్ లేకుండా చూపించారు. కాగా., దర్శకుడు కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మెహ్రిన్ పిర్జాదా కి ధన్యవాదాలు తెలిపాడు.

 

 

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ కి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. కథానుగుణంగా కులీమనాలి, గోవా, ఒంగోలు, కేర‌ళ‌, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోని ప‌లు అందమైన లొకేషన్స్‌ లో షూటింగ్ జరిపామని ఆయన తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: