అభిమానులదు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా... వాళ్ళ అతి కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే ఇలాగే అనిపిస్తుంది అంటూ పలువురు సోషల్ మీడియాలో వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎం చేసినా రైట్, ఇతరులు ఎం చేసినా రాంగ్ అంటూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళు చేసే వ్యాఖ్యలు కూడా కాస్త హద్దు మీరుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని దేవుడుగా చూస్తూ ఉంటారు. అంత వరకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు గాని మితిమీరి కామెంట్లు చేయడంతోనే అసలు సమస్య అంతా వస్తుంది. 

 

ఆ అభిమానాన్ని పక్కన వారి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అభిమానులు. దీనితో చాలా మంది ఇప్పటికే ఇబ్బంది పడ్డారు. వారిలో ప్రధానంగా చెప్పుకునేది రేను దేశాయ్ గురించి. పవన్ కలిసి ఉన్నప్పుడు వదిన అని ఇప్పుడు నోటితో కూడా చెప్పలేని విధంగా మాట్లాడుతూ, కామెంట్లు చేస్తూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే రేణుదేశాయ్ ని లక్ష్యంగా చేసుకుని వాళ్ళు చేసే విమర్శలు శృతి మించుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేణుదేశాయ్ కి చుక్కలు చూపిస్తున్నారు పవన్ అభిమానులు. 

 

అసలు ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే తిడుతున్నారు. ముందు ఇబ్బంది పడిన రేణుదేశాయ్ ఇప్పుడు ఇక వారిని లైట్ తీసుకుందని సమాచారం. వాళ్ళు చాలా వరకు ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా అచేసుకుని విమర్శలు చేయడంతో వాళ్ల కామెంట్స్ ని డిలీట్ కూడా చేస్తున్నట్టు సమాచారం. పదే పదే తనను తిడుతూ కామెంట్లు చేసే వాళ్ళను ఆమె బ్లాక్ కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె చాలా వరకు తన సంతోషాలను కూడా పంచుకోలేని స్థితిలో ఉందని అంటున్నారు. ఏ పోస్ట్ పెడితే ఏ చిక్కు వస్తుందో అని ఆమె భయపడుతున్నట్టు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: