టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరోలలో చాలా మంది ఉన్నారు. నితిన్‌, ప్ర‌భాస్‌, రానా, నిఖిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. అయితే వీరిలో ఇద్ద‌రు యంగ్ హీరోల‌కు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. నిఖిల్ వ‌ర్మ‌తో పాటు మ‌రో యంగ్ హీరో నితిన్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు హీరోల‌కు ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ అయ్యాయి.

 

తెలంగాణ‌కు చెందిన నితిన్ ఇప్పుడు ఆంధ్రాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. నితిన్ షాలిని రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ కూడా అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 16 దుబాయ్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారు.

 

ఇక నితిన్ పెళ్లాడే అమ్మాయికి సోష‌ల్ మీడియా అక్కౌంట్ కూడా లేక‌పోవ‌డంతో నితిన్‌కు కాబోయే భార్య ఎవ‌రు ? ఆమె స్వ‌స్థ‌లం ఏంటి ? ఎక్క‌డ ఉంటారు ? అన్న ప్ర‌శ్న‌ల‌పై నెటిజ‌న్లు స‌హ‌జంగానే ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే నితిన్ - షాలిని ఇద్ద‌రు వీరి కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. అయితే వీరి ప‌రిచయం కాస్తా ముందు స్నేహంగా మారి.. ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది.

 

చివ‌ర‌కు వీరు ఇద్ద‌రు త‌మ స్నేహితుల స‌హ‌కారంతో కొన్నేళ్లుగా ప్రేమించుకుని ఇప్పుడు పెద్ద‌ల అంగీకారంతో ఎట్ట‌కేల‌కు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఈ ప్రేమ‌లో ఫ‌స్ట్ నితినే షాలినికి ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. నితిన్ ప్ర‌పోజ‌ల్ కు ఒప్పుకునేందుకు ఆమె కొద్ది టైం తీసుకున్నా వెంట‌నే ఓకే చెప్పింద‌ట‌. అలా నితిన్ - షాలిని ప్రేమ పెళ్లితో శుభం కార్డుకు చేరుకోబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: