యంగ్ విజయ్‌ దేవరకొండను సెన్సేషనల్ స్టార్‌ను చేసిన సినిమా అర్జున్‌ రెడ్డి. ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ అయిన అర్జున్‌ రెడ్డి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగానే ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించాడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్‌ సింగ్ పేరుతో రిలీజ్‌ అయిన అర్జున్‌ రెడ్డి బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది.

 

అయితే కబీర్‌ సింగ్‌ సినిమా రిలీజ్‌ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కబీర్‌ సింగ్‌లా అమ్మాయిలకు ఏ మాత్రం మర్యాద ఇవ్వని ఓ పాత్రను హీరోలా ఎలా చూపిస్తారని ఫెమినిస్ట్‌లు ఆందోళనలు చేశారు. పలువరు ప్రముఖులు సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమాను తీవ్రంగా విమర్శించారు. అయితే జనం మాత్రం కబీర్‌ సింగ్‌కు కాసుల పంట పండిచారు. ఈ సినిమా 2019లో హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి సత్తా చాటింది.

 

తాజాగా ఈ సినిమాపై సీనియర్ హీరో విద్యా బాలన్ స్సందించింది. ఓ కాలేజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన ఆమె కబీర్‌ సింగ్‌ పాత్రను సమర్థించటం విశేషం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `కబీర్‌ సింగ్ సినిమా సమయంలో చాలా మంది విమర్శించారు. కానీ సినిమా చూసిన తరువాత నాకు అలా అనిపించలేదు. కబీర్‌ సింగ్‌ లాంటి వ్యక్తులు సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మనం ఆ నిజాన్ని అంగీకరించటానికి సిద్ధంగా లేము అంతే. గతంలో అయితే నేను కూడా ఈ సినిమాను తప్పు పట్టేదాన్ని. కాన్నీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. అందుకే ఈ సినిమా కరెక్టే అనిపిస్తుంది` అంది విద్యా బాలన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: