‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫ్లాప్ అవ్వడంతో సంక్రాంతి సినిమాల తరువాత వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. దీనితో ధియేటర్స్ వద్ద ప్రేక్షుకుల సందడి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ తో అయినా బాక్స్ ఆఫీసు మళ్ళీ పుంజు కుంటుంద లేదా అన్న విషయమై ఎవరు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.


మూవీ పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. దీనికితోడు ఈసారి ‘మహాశివరాత్రి’ శుక్రు వారం రావడంతో సెలవు రోజు అడ్వాంటేజ్ కూడ ‘భీష్మ’ కు కలిసి వస్తోంది. సంక్రాంతి సినిమాలు తరువాత చూడడానికి సరైన సినిమా ఒక్కటి కూడ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న సగటు ప్రేక్షకుడు ‘భీష్మ’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ మూవీకి భారీ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది.


ఈ మూవీని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ ‘అల వైకుంఠపురములో’ మూవీని తీసిన హారికా హాసినీ సంస్థకు అనుబంధ సంస్థ. దీనితో ‘అల’ మ్యానియాతో కూడిన అదృష్టం ‘భీష్మ’ లో కూడ కనిపిస్తుంది అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ హక్కుల కోసం అనేకమంది బయ్యర్లు భారీ రెట్లు ఆఫర్ చేసినా ఈ మూవీ నిర్మాతలు ‘భీష్మ’ బిజినెస్ ను తక్కువ లాభాలతో క్లోజ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


వాస్తవానికి మూవీ నిర్మాతలు తమ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ వచ్చినప్పుడు వాటిని పూర్తిగా సద్వినియోగ పరుచుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ‘భీష్మ’ నిర్మాతలు వ్యవహరిస్తూ ఉండటంతో వారు ఆడుతున్న సేఫ్ గేమ్ అనుకోవాలా లేదంటే ఈ మూవీ పై కూడ వారికి పూర్తి నమ్మకం లేదా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో కొత్త పెళ్ళి కొడుకుగా మారబోతున్న నితిన్ మాత్రం ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుని చాల పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: