సినీ నటుడు శ్రీకాంత్ కు పితృ వియోగం కలిగింది. పితృవియోగం కలిగింది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు కన్నుమూశారు. ఆది వారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు తుది శ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

 

శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు కు ఊపిరితిత్తుల సమస్య ఉంది. కొన్నాళ్లుగా పరమేశ్వర రావు హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్‌లో ఈ వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారు. మొదట్లో వ్యాధి కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఆ తర్వాత తీవ్రమైంది. చివరకు ఆది వారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు పరమేశ్వరరావు కన్ను మూశారు.

 

శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరమేశ్వరరావు 1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకా వారి పాలెంలో జన్మించారు. అయితే.. ఆ తర్వాత కాలంలో ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వలస వెళ్లారు. బసవపాలెంలో స్థిరపడ్డారు.

 

పరమేశ్వరరావుకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. పరమేశ్వరరావు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహా ప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విషాదంలో ఉన్న శ్రీకాంత్ కుటుంబానికి సినీరంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: