తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పేరుగాంచిన హీరోలలో మహేష్ బాబు ఒకరని మనం చెప్పుకోవచ్చు. ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికంగా ఉంది. మరి అంత గొప్ప పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కేంత యాక్టింగ్ స్కిల్స్ మహేష్ బాబులో ఉన్నాయా? అని ప్రశ్నిస్తే లేదు అనే చెప్పుకోవాలి.



గొప్ప నటుడు అంటే అన్నీ పాత్రలు పోషించాలి. కానీ మహేష్ బాబు కేవలం మాస్ పాత్రలను, అస్సలు ఛాలెంజింగ్ గా లేని రోల్స్ లో మాత్రమే ఇప్పటివరకు నటించాడు. దీంతో ఈయన కేవలం ఒక సీరియల్ స్టార్ అనే ముద్ర పడిపోయింది. మన తెలుగు ఇండస్ట్రీలో అతడిని ఆదరించినా... వేరే బాషా సినీ అభిమానులు మాత్రం అంతగా ఇష్టపడరు. ఇక అతని సినిమాలు హిట్ కావడానికి ముఖ్య కారణం.. ఆయన ఎంపిక చేసుకొనే మంచి కథలు. ఇకపోతే వీక్ గా ఉన్న సినిమాలు, ఇంకా ఆయన చేయలేనంటువంటి ఏ కథ అయిన రిజెక్ట్ చేయడం, ఎంపిక విషయంలో పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోవడం వలన అతడి సినిమాలు హిట్(ఆగడు తప్ప) అవుతున్నాయని చెప్పుకోవచ్చు.




నిజానికి సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ అయిన 24లో మహేష్ బాబుని నటించమని అడిగితే అతడు నా వల్ల కాదని చేతులెత్తేశాడు. కానీ సూర్య మాత్రం ఈ ఆఫర్ ని ఒప్పుకొని ఆ సినిమాలోని 3 పాత్రలలో బ్రహ్మాండంగా నటించి నటన అంటే ఏమిటో చూపించాడు. మొన్నీమధ్య కూడా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఏదో నాలుగు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేట్లు ఒక సినిమా తీసి ప్రేక్షకుల మీద రుద్దేసాడు మన మహేష్ బాబు.




తన కెరియర్ లో మాస్ రోల్స్ తప్ప మరేతర క్యారెక్టర్లను చేయని మహేష్ బాబు సూపర్ స్టార్ కావచ్చు కానీ ఒక మంచి నటుడని పిలవడం మాత్రం సరైనది కాదు. నిజానికి ప్రస్తుత కాలంలో తెలుగు ఇండస్ట్రీలో గొప్ప కుర్ర నటులు(ఓ ఇద్దరు తప్ప) ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఇంకా తదితర హీరోలు ఛాలెంజింగ్ రోల్స్ ని చేసి గొప్ప నటులుగా పేరు పొందారు. అంతెందుకు ప్రస్తుత బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, ధనుష్ కూడా భిన్నమైన పాత్రలు చేసి అందరిని అలరించారట్లేదా? వాళ్లు ఏ పాత్ర చేయడానికైనా రెడీ అయినప్పుడు మన హీరోలు ఎందుకు ముందడుగు వేయట్లేదు? దానికి సమాధానం మన హీరోలలో అంత నటన నైపుణ్యం లేకపోవడం. అలాగే కంఫర్ట్ జోన్ లో ఉంటూ స్టార్ డంని కొనసాగించడం మన హీరోలకు బాగా అలవాటైపోయింది. మహేష్ బాబుకి కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఏదేమైనా భవిష్యత్తులోనైనా బహుముఖ పాత్రలలో నటించి తనలో కూడా ఒక గొప్ప నటుడు ఉన్నాడని మహేష్ బాబు పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: