టాలీవుడ్ లో స్టార్ దర్శకులు ఎవరూ అనగానే ముందు వినపడే పేరు రాజమౌళి. ఆ తర్వాత వినపడే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ళు ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి హిట్ లు కూడా కొట్టేసారు. త్రివిక్రమ్ సంగతి ఏమో గాని రాజమౌళి అయితే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. నందమూరి, మెగా కుటుంబాన్ని బుట్టలో వేసుకున్న జక్కన్న ఇప్పుడు వాళ్ళతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ఇప్పుడు ఈ సినిమానే రాజమౌళికి, త్రివిక్రమ్ కి మధ్య చిచ్చు పెట్టింది అంటున్నారు. అసలు ఆ స్టొరీ ఏంటీ అనేది ఒకసారి చూస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మే లో అయిపోతే జూలై నుంచి సెట్స్ పైకి తీసుకు వెళ్ళే ఆలోచన చేసాడు త్రివిక్రమ్. దీనికి తగ్గట్టు గానే అల వైకుంఠపురములో సినిమాను వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చాడు. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లేట్ అవుతుంది. 

 

ముందు ఈ సినిమాను దసరా కు విడుదల చేస్తారు అని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు మార్చి ఇప్పుడు మళ్ళీ సినిమాను సంక్రాంతి అంటున్నారు. దీనితో త్రివిక్రమ్ టైం వేస్ట్ అవుతుంది. సినిమా కథను కూడా దాదాపుగా సిద్దం చేసుకుని పెట్టుకున్న తరుణంలో ఎదురైన ఈ పరిణామం చూసి, షాక్ అయ్యారు. దీనితో తన సన్నిహితుల రాజమౌళి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారట. ఒక హీరో ని ఇన్ని రోజులు బుక్ చేసుకుని అది కూడా వేరే సినిమా చేయకుండా చూస్తే ఎలా అంటూ మందిపద్దారట. ఈ విషయ౦ ఆ నోటా ఈ నోటా పడి రాజమౌళి వరకు వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: