ఒక సినిమా ఫెయిల్ అయితే కేవలం ఒకరోజు మాత్రమే దిల్ రాజ్ బాధపడుతూ ఉంటాడు అని అంటారు. ‘జాను’ ఫెయిల్యూర్ తో షాక్ అయిన దిల్ రాజ్ ఆ షాక్ నుండి వెంటనే తేరుకుని సమ్మర్ రేసుకు రాబోతున్న ‘పింక్’ రీమేక్ వ్యవహారాల గురించి సూచనలు ఇవ్వడమే కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అని భావిస్తున్న తన ‘ఎఫ్ 3’ మూవీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు అనీల్ రావిపూడి తో చర్చలు చేస్తూ ఈ సినిమాకు సంబంధించి ప్లాన్ ఎ ప్లాన్ బి లు రెడీ పెట్టినట్లు సమాచారం. 


తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఎఫ్ 3’ మూవీలో మూడవ హీరోగా మహేష్ ను ఎంపిక చేసే విషయమై ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు టాక్. మహేష్ దిల్ రాజ్ చెప్పిన ప్రోపాజల్ కు నో చెప్పలేదని  తెలుస్తోంది. అయితే ఈ మూవీలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో పాటు ఇప్పుడు మహేష్ కూడ చేరడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందని దిల్ రాజ్ ఒక ప్రాధమిక అంచనాకు వచ్చినట్లుతెలుస్తోంది. 


ఇప్పటికే ‘ఎఫ్ 3’ లో నటించడానికి వెంకటేష్ వరుణ్ తేజ్ లు తమ పారితోషికాన్ని పెంచడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మహేష్ చేరిక వల్ల ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చు మరింత పెరగడంతో ఎంత వరకు లాభదాయకం అన్న ఆలోచనలు దిల్ రాజ్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘ఎఫ్ 3’ మూవీలో ముగ్గురు హీరోలు లేకుండా కేవలం వెంకటేష్ వరుణ్ తేజ్ లతోనే ఈ సీక్వెల్ ను తీస్తే ప్రాజెక్ట్ ఖర్చు తగ్గి లాభాలు ఎక్కువ వస్తాయి కదా అన్న ఆలోచనలు కూడ దిల్ రాజ్ కు ఉంది అని అంటున్నారు.


దీనికితోడు ‘ఎఫ్ 3’ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రోజున ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాతో సంబంధం లేకుండా విడుదల చేసే ఉద్దేశ్యం దిల్ రాజ్ కు ఏర్పడటంతో ‘ఎఫ్ 3’ మూవీని వీలైనంత తక్కువ బడ్జెట్ తో తీస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా కొనసాగినా తన మూవీకి ఎటువంటి నష్టం ఉండదు అన్న అభిప్రాయం ఇప్పటికే దిల్ రాజ్ కు ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి.  దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ పోటీ ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సంక్రాంతికి ‘ఎఫ్ 3’ ని విడుదల చేయాలి అంటే తన ఆలోచనలలో ఉన్న ప్లాన్ ఎ ప్లాన్ బి లలో ఏది బెటర్ అంటూ దిల్ రాజ్ చేస్తున్న ఆలోచనలు రాజమౌళి దృష్టి వరకు రావడంతో తన ‘ఆర్ ఆర్ ఆర్’ ను నైజాం ఏరియాలో విడుదల చేసే దిల్ రాజ్ ఇలా తనను ఎందుకు కార్నర్ చేస్తున్నాడు అంటు ఆశ్చర్య పోతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: