టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదని ఓ చిత్రంలో హీరో డైలాగ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంత మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ తో దుమ్మురేపుతున్నారు. టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి వినూత్నంగా తమ ప్రదర్శన చేస్తూ అందరి చూపు తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఒకప్పుడు మనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. టాలెంట ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా టెక్నాలజీ బైటపెట్టేస్తోంది. ఈ టెక్నాలజీతో ఎటువంటి గుర్తింపు లేనివారిని కూడా రాత్రికి రాత్రే ఓవర్‌నైట్ సెలబ్రిటీల్ని చేసేస్తోంది. అయితే కొన్ని సార్లు వారు చేస్తున్న స్ట్రిట్స్ ప్రమాదం అని తెలిసినా గుర్తింపు కోసం ఎన్నో బాధలు పడుతున్నారు. ఇక డ్యాన్స్ అంటే ప్రాణం ఇచ్చేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.
ఈ మద్య డ్యాన్స్ కాంపిటీషన్లు కూడా బాగానే పెరిగిపోతున్నాయి. బుల్లితెరపై ఇలాంటి డ్యాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఎన్నో వస్తున్నాయి. ఇలా ఇంటర్ నేషనల్ స్థాయిలో గొప్ప ప్రదర్శనలు ఇస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. తాజాగా ఓ నలుగురు కుర్రాళ్లు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పడు దుమ్మురేపుతుంది. నలుగురు యువకులు తమ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మతిరిగే స్టెప్పులు వేసి అద్దరగొట్టేశారు.
స్టెప్స్ అర్ధం కాక పదే పదే ఆ వీడియోని చూసి థ్రిల్‌కి గురవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. తాజాగా ఈ కుర్రాళ్లు చేస్తున్న డ్యాన్స్ ఎంతో స్పిరిట్ దాగి ఉందని అంటున్నారు. ఇలాంటి డ్యాన్సర్లకు మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. వీళ్లు ఎవరు? ఎక్కడ చేశారు? అనే విషయం తెలియదు కానీ.. ఈ కుర్రాళ్ల డ్యాన్స్ కి మాత్రం ప్రతి ఒక్కరూ ఆహా అని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.