కీర్తి సురేష్... ఈ అమ్మాయిని సినిమాల్లో చూసి చాలా మంది లో ఉన్న అభిప్రాయ౦, ఇలాంటి అమ్మాయి చక్కగా జాబు చేసుకోక వ్యాపారాలు చేసుకోక ఆమెకు ఎందుకు సినిమాలు అని అన్నారు. ఎందుకో తెలుసా ఆమెకు ఉన్న అందమే దానికి కారణం. కీర్తి సురేష్ అందరిలాంటి అమ్మాయి కాదు అనేది వారి అభిప్రాయ౦. కీర్తిని చూసి పక్కింటి అమ్మాయిలా ఉందీ అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆమె సినిమాలు చేయడం ఆమె అభిమానులకు కూడా నచ్చడం లేదని టాక్. కాని ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 

 

కాని ఆ ఫాలోయింగ్ ని తెలుగు సినిమా వాడుకోలేకపోయింది అంటున్నారు. చిన్న హీరోల పక్కన కీర్తి మంచి ఆప్షన్. ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పక్కన కూడా చేసే రేంజ్ ఆమెకు ఉంది. మంచి పాత్రలకు కీర్తి చక్కగా సరిపోతుంది. కాని ఆమెను వాడుకోలేక పోయింది టాలీవుడ్. ఒక దర్శకుడు ఆమెను స్కిన్ షో చేయాలని కోరగా తాను అవసరమైతే టాప్ వేసుకుంటా గాని స్కిన్ షో మాత్రం చేసేది లేదు అని స్పష్టంగా చెప్పేసింది. ఇక ఆ తర్వాత ఆమె తమిళ సినిమాలు చేసుకుంటుంది. 

 

వాస్తవానికి తమిళంలో కీర్తికి చాలా ఫాలోయింగ్ ఉంది. అక్కడ సిని పరిశ్రమలో నటనకు ప్రాధాన్యత ఇస్తారు. మహానటి సినిమాలో కీర్తి నటన చూసి కూడా ఆమెను వదులుకున్నారు మనవాళ్ళు. ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి హీరోయిన్ ని ఎవరైనా వదులుకుంటారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రష్మిక, పూజ హెగ్డే కి అసలు నటన రాదని, వాళ్ళు కీర్తి సురేష్ కి ఏ మాత్రం సరితూగే అవకాశం లేదని, అలాంటి హీరోయిన్ వదులుకోవడం నిజంగా మంచి విధానం కాదని, అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారని అంటున్నారు సినీ ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి: