భారతీయ చలన చిత్ర రంగంలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ విశ్వనటుడు కమల్ హాసన్.  గత కొంత కాలంగా ఆయన తీస్తున్న చిత్రాలు ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఆయన 2000 సంవత్సరంలో తెరకెక్కించిన ‘హే రామ్’ చత్రంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువు అయ్యింది. ‘హే రామ్‌’ ఒక పిరియాడికల్ చిత్రంగా తెరకెక్కించారు కమల్ హాసన్. ఈ చిత్రంలో  షారుఖ్‌ఖాన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య ఫిబ్రవరి 18, 2000 విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  తాజాగా ఈ చిత్రం రిలీజ్ అయి ఇప్పటికీ ఇరవై ఏళ్లు అవుతుంది.  ఈ సందర్భంగా కమల్ హాసన్ ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలోపెట్టారు. 

 

ఈ చిత్రం రిలీజ్ సమయంలో బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినా, నిజాన్ని నిర్భయంగా చెప్పాం అన్న సంతృప్తి ఉందని అన్నారు. ఈ సవాళ్లన్నీ అధిగమించి దేశ సామరస్యాన్ని పరిరక్షించే లక్ష్యంలో విజయం సాధిస్తాం పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ గా కమల్ హాసన్ నటించారు.  ఇక ఆయన స్నేహితుడిగా అంజాద్‌ అలీఖాన్‌ పాత్రను పోషించారు. అప్పట్లో షారూఖ్ ఖాన్ మంచి హీరోగా ఫామ్ లోకి వచ్చారు.  అయితే ఈ చిత్రానికి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని అందరూ భావించారు.  అయితే ఇందులో షారుఖ్‌చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ స్వయంగా చెప్పారు. 

 

 వాస్తవానికి ఈ చిత్రానికి తాను భాగ స్వామిని మాత్రమే కావాలని కమల్ భావించారట.. కానీ ఆ భారం మొత్తం తనపైనే పడిందట. అదేసమయంలో షారూఖ్ ఖాన్ ఈ చిత్రంలో చిన్నపాత్రలో కనిపించినా పరవాలేదు అన్నారట. కానీ ఆయన పాత్ర కి మంచి ఆదరణ వచ్చింది.  బడ్జెట్ విషయం షారూఖ్ కి అర్థం అయ్యింది. అందుకే ఆయన ఒక్క పైసా కూడా అడగలేదు. అయితే ప్రేమతో నేను వాచ్ ఇచ్చానని కమల్ హాసన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: