గత కొన్ని రోజులు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి అందులో భాగంగా అరవింద సమేత తరువాత మళ్ళీ త్రివిక్రమ్ తోనే తన 30వ సినిమా చేయనున్నాడని  లేదు అసురన్ డైరక్టర్ వెట్రిమారన్ తో తదుపరి సినిమా  చేయనున్నాడని  ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ 30 విషయంలో రేపు క్లారిటీ రానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్య దేవర నాగ వంశీ రేపు అధికారకంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈసినిమా కు సంబంధించిన అప్డేడ్ ఇవ్వనున్నాడు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాసే, ఎన్టీఆర్ 30ని డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. 
 
ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ కావడం అలాగే  ఇటీవల అల.. వైకుంఠపురములో తో ఇండస్ట్రీ హిట్ ను అందివ్వడం తో ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ వైపే మొగ్గు చూపాడట. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ను పెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు త్రివిక్రమ్. ఈఏడాది సెకండ్ హాఫ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదలచేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
 
ఇదిలావుంటే ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తారక్ ,టెంపర్ నుండి అపజయమే లేకుండా కొనసాగుతున్నాడు. ఏకంగా వరుసగా 5విజయాలను అందుకోగా ఆర్ఆర్ఆర్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: