తెలుగు సినీ పరిశ్రమగా ఉన్నప్పుడు.. టాలీవుడ్ గా మారాక కూడా చిరంజీవీ తన క్రేజ్ తో మెగాస్టార్ గా వెలిగిపోతున్నాడు. పదేళ్ల గ్యాప్ కూడా ఆయన క్రేజ్ ను మార్చలేదు. హీరో అన్నాక హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, కూడా ఉంటాయి. కానీ.. టాలీవుడ్ చరిత్రలోనే చిరంజీవి ఇచ్చినన్ని ఇండస్ట్రీ హిట్లు మరే టాలీవుడ్ హీరో ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఏకంగా పది ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనే కీర్తికి చిరంజీవి న్యాయం చేశారు.

 

 

ముఖ్యంగా ఆయన 1987 నుంచి 1992 వరకూ ప్రతి ఏడాది ఓ ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చి చరిత్ర సృష్టించారంటే అతిశయోక్తి కాదు. తొలిసారి 1983లో ఖైదీతో తొలి ఇండస్ట్రీ హిట్ నమోదు చేశారు చిరంజీవి. తర్వాత 1987లో పసివాడి ప్రాణం మొదులు..1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేకవీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 1992లో ఘరానామొగుడు.. వరకూ ఇవన్నీ ఇండస్ట్రీ హిట్స్ గ 100 రోజుల సెంటర్స్, కలెక్షన్లలో రికార్డులు తిరగరాసి కొత్త రికార్డులు సెట్ చేశాయి. తర్వాత 1998లో చూడాలని ఉంది, 2002లో ఇంద్ర, 2017లో ఖైదీ నెంబర్ 150 (నాన్ బాహుబలి)తో టాలీవుడ్ కి సరికొత్త రికార్డులను సెట్ చేశారు.

 

 

ఇటువంటి రికార్డు కానీ, ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ కానీ మరే హీరోకు లేవు. చిరంజీవి తన ప్లస్ ఎలిమెంట్స్ అయిన డ్యాన్సులు, ఫైట్లతో అప్రతిహత విజయాలతో ఏళ్లపాటు దూసుకెళ్లిపోయారు. న్యూ జనరేషన్ వచ్చినా చిరంజీవి సినిమాలు అదే స్థాయిలో కలెక్షన్లు సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు. చిరంజీవి రికార్డు కలెక్షన్లను ఇప్పటి రేట్లతో పోల్చి చూస్తూ నాన్ చిరంజీవి రికార్డులుగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండిపోతాయనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: