సినిమాల్లో చిరంజీవి శకం నడుస్తున్న సమయంలో ఆయన సినిమా రిలీజ్ ఉందంటే మిగిలిన సినిమాలు ఓ వారం అటూ ఇటుగా విడుదలయ్యేవి. టాక్ తో సంబంధం లేని కలెక్షన్లు, హిట్ ఫ్లాపులకు అతీతంగా సినిమా వంద రోజులు ఆడటం ఒక్క చిరంజీవి సినిమాలకే సాధ్యమైంది. చిరంజీవి కెరీర్లో డిజాస్టర్లలో ఒకటైన బిగ్ బాస్ వసూలు చేసిన టోటల్ కలెక్షన్లను.. అప్పట్లో ఓ తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా రెండు వందల రోజులకు అంతే సమానంగా  వసూలు చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మరో భారీ డిజాస్టర్ అయిన మృగరాజు సినిమా కూడా విజయవాడ, కాకినాడ నగరాల్లో 100రోజులు ప్రదర్శితమయ్యాయి.

 

 

ఇలా ఎన్నో సినిమాలు ఆయన క్రేజ్ కు అనుగుణంగా రన్ అయ్యాయి. ప్రస్తుతం రన్ కంటే కేవలం కలెక్షన్లే ప్రామాణికమయ్యాయి. తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్న తనను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానాలు చిరంజీవికే ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ఖైదీ నెంబర్ 150 ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు సాధించింది. తెలుగులోనే 104కోట్ల షేర్ సాధించి మెగాస్టార్ స్టామినాను నిరూపించింది. పిరియాడికల్ మూవీ సైరా కూడా కేవలం తెలుగులోనే 100కోట్లకు పైగా షేర్ సాధించి టాలీవుడ్ రారాజు చిరంజీవే అని నిరూపించింది.

 

 

ఒకప్పుడు ఆయన సినిమాలు 100 రోజులు సునాయసంగా ఆడితే.. ఇప్పుడు 100కోట్ల కలెక్షన్లు కూడా అదే విధంగా సాధిస్తున్నాయంటే ప్రేక్షకుల్లో చిరంజీవి సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ చిరంజీవి డ్యాన్సుల్లో, స్టయిల్ లో, యాక్షన్ లో తన మార్క్ గ్రేస్ చూపించడమే ఇందుకు కారణం. తన వజ్రాయుధాలైన డ్యాన్సులు, కామెడీ ఏమాత్రం లేకుండా తీసిన సైరా కూడా 100కోట్ల క్లబ్ లో చేరడం అంటే అది చిరంజీవి సాధించిన అప్రతిహత స్టార్ డమ్ కు నిదర్శనమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: