తెలుగు లో మెగాస్టార్ పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత కొణిదెల ప్రొడక్షన్.. రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహ్మారెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచిన మొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.  ప్రస్తుతం తెలుగు లో వరుసగా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో  తనదైన హిట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు దర్శకులు కొరటాల శివ.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఈ చిత్రం దేవాలయాల మాఫియాపై ఓ ప్రొఫెసర్ తిరుగుబాటు నేపథ్యంలో రాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతే కాదు ఈ చిత్రంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ ఔట్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టును అంగీకరించకూడదు, ఆ చిత్రానికి ముందు .. చరణ్ చేసిన మరో చిత్రం విడుదల కాకూడదట. అందువల్లనే కొరటాల  చిత్రంలో  చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. 

 

అయితే ఆయన స్థానంలో మెగా హీరోలు ఎవరో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారట.  అయితే ఆ ఛాన్స్ ఎక్కువగా బన్నీకే దక్కేలా ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  ఎందుకంటే ఎప్పటి నుంచి తన మామయ్య చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. చరణ్ చేయాలనుకున్న ఆ పాత్రకు అల్లు అర్జున్ అయితే బాగుంటాడనే అభిప్రాయాన్ని కొరటాల వ్యక్తం చేశాడట. ఆ పాత్రను చేయడానికి అల్లు అర్జున్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: