టాలీవుడ్ లో ఈ మధ్య వసూళ్ళ మేనియా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు వసూళ్లు వస్తేనే హిట్ అయినట్టు లేకపోతే సినిమా రాడ్డు అన్నట్టే. కాబట్టి దర్శక నిర్మాతలు కూడా సినిమా ప్రచారం విషయంలో అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే వసూళ్లు వస్తేనే హిట్ అయినట్టు. ఈ నేపధ్యంలో తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు ఏమో గాని చిన్న హీరోల సినిమాల విషయంలో సినిమా కొనే వాళ్ళు ఆలోచనలో పడిపోయారట. 

 

శర్వానంద్ నటించిన జానూ సినిమా ఫ్లాప్ టాక్ ఏ తెచ్చుకుంది. ఈ సినిమా మంచి అంచనాలతో వచ్చినా హిట్ అవ్వలేదు. దీనితో ఇప్పుడు ఆ సినిమా విషయంలో కొనుక్కున్న వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. భారీ లాభాలు వస్తాయని భావించినా రాలేదట. ఇక విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఎంతో ఆశగా ఈ సినిమా కొనుగోలు చేస్తే చాలా వరకు నష్టపోయారట. ఆంధ్రా ప్రాంతంలో ఒక వ్యక్తి అయితే ఈ సినిమాను 10 కోట్లకు పైగానే ఖర్చు చేసి కొన్నాడు. 

 

కాని మూడు కోట్లు కూడా రాలేదని సమాచారం. ఇప్పుడు నితిన్ భీష్మ సినిమా విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది అంటున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండటం తో ఎక్కువ ధరకే కొనుగోలు చేసారు కొందరు. దీనితో సినిమా హిట్ అవుతుందో లేదో అనే భయం వ్యక్తమవుతుంది కొందరిలో. ఇక నుంచి చిన్న సినిమాలను కొనే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం మునిగిపోవడం ఖాయమని కొనుగోలు దారులు భయపడుతున్నారు. నానీ సినిమాల విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తున్నారట కొందరు. మరి భీష్మ ఎం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: