విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. మూడేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా ఏ అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఆ సినిమాలో లవ్ స్టొరీ కి అభిమానులు ఫిదా అయిపోయారు. లవ్ సీన్స్ ని దర్శకుడు తీసిన విధానం చూసి అభిమానులు ఒకరకంగా షాక్ అయ్యారు కూడా. ఆ తర్వాత అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ కు ముద్ర కూడా పడిపోయింది. శాలిని పాండే కూడా ఆ సినిమాలో జీవించింది. 

 

అప్పటి నుంచి విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా విజయ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ హీరో, దర్శకుడి కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. భారీ అంచనాల మధ్య వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ కావడంతో విజయ్ జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. సందీప్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ రణబీర్ సింగ్‌తో పక్కా క్రైమ్ డ్రామాగా తీయాలని ప్లాన్ చేసాడు. 

 

కాని అందుకు రణబీర్ సింగ్ అంగీకరించలేదు అని సమాచారం. దీనితో మళ్ళీ విజయ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ హీరోలతో చెయ్యాలి అనుకున్న సినిమా ను మళ్ళీ విజయ్ తోనే ప్లాన్ చేసాడు. వాళ్ళు అక్కడ బిజీ గా ఉన్న నేపధ్యంలో విజయ్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ టాలెంట్ ని అర్జున్ రెడ్డి సినిమాలో చూసాడు సందీప్. దీనితో ఈ సినిమాకు విజయ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాడట. ఈ సినిమాలో రేపిస్ట్ గా విజయ్ నటించే అవకాశ౦ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: