ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ లో టాప్‌ హీరోల స్థాయి క్రేజ్‌ సొంతం చేసుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో సెన్సేషన్‌ సృష్టించిన విజయ్‌ దేవరకొండ, తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో క్రేజీ స్టార్‌ అనిపించుకున్నాడు. అయితే వరుస ఫ్లాప్‌ లు ఈ యంగ్ హీరో కెరీర్‌కు బ్రేకులు వేస్తున్నాయి. విజయ్‌ హీరోగా తెరకెక్కిన నోటా, డియర్‌ కామ్రేడ్ సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో ఇటీవల విడుదలైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్‌.

 

కానీ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కూడా విజయ్‌ కి షాక్‌ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా డిజాస్టర్‌ అయ్యింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గతంలో డియర్‌ కామ్రేడ్‌ ఫెయిల్ అయిన సమయంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న హీరో సినిమాను ఆపేశారన్న ప్రచారం జరిగింది. అయితే తరువాత నిర్మాతలు ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించారు.

 

అయితే తాజాగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్ ఫెయిల్యూర్‌ కావటంతో హీరో సినిమా పై మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం హీరో సినిమాను నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారట. విజయ్ మార్కెట్ భారీగా తగ్గటంతో హీరో లాంటి భారీ బడ్జెట్ సినిమా వర్క్‌ అవుట్ కాదని భావిస్తున్నారట. అందుకే మీడియం బడ్జెట్‌లో మరో దర్శకుడితో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మారుతి, సుజిత్ లాంటి దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: