సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈచిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించనుందని ఇంతకుముందే వార్తలు రాగ తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అనన్య కు సౌత్ లో ఇదే మొదటి సినిమాకాగా దేవరకొండ ఈ చిత్రం తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ముంబై తోపాటు విదేశాల్లో అరు నెలల పాటు షూటింగ్ జరుపుకోనుంది.
 
బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడట. ప్రముఖ బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ,సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్ తోకలిసి ఛార్మి , పూరి కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు తోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదలచేయనున్నారు. ఇక పూరి జగన్నాథ్ ,విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడం తో ఫైటర్ పై మంచి అంచనాలు వున్నాయి.   
 
ఇదిలావుంటే గత ఏడాది డియర్ కామ్రేడ్ తో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న విజయ్ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ తో డబుల్ డిజాస్టర్ ను చవిచూశాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తో ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేక చేతులెత్తేసింది. దాంతో వరుసగా రెండు డిజాస్టర్ లను చవిచూడడం తో విజయ్, ఫైటర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి  బౌన్స్  బ్యాక్ కావాలని  విజయ్  పట్టుదలతో వున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: