టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా విజయ్ దేవరకొండ పేరు మోగిపోయింది మొన్నటివరకూ. ఇప్పటికీ విజయ్ సినిమాలకు మార్కెట్ ఉన్నా.. ప్రస్తుతం విజయ్ సినిమాలంటే ఓసారి ఆలోచించాల్సి వచ్చే పరిస్థితులు వచ్చేశాయి. సినిమా కథలో, ఆన్ లొకేషన్లో మితిమీరిన జోక్యంతో వరుస ఫ్లాపులు చవి చూస్తున్నాడు. విజయ్ యాటిట్యూడ్ వల్ల తనకు ఫ్లాప్ మాత్రమే వస్తే నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవడం, దర్శకుల కెరీర్ కు బ్రేకులు పడడం జరుగుతున్నాయి. దీంతో విజయ్ తో సినిమాలు తీసేవారు ఇకపై ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 

 

నోటా, డియర్ కామ్రేడ్, ఇప్పడు వరల్డ్ ఫేమస్ లవర్. వరుస ఫ్లాపులతో విజయ్ కెరీర్ నడుస్తోంది. టాక్సీవాలా యావరేజ్ గా వెళ్లిపోయింది. కేవలం విజయ్ తీరుతోనే వరల్డ్ ఫేమస్ లవర్ దారుణమైన ఫలితాన్ని పొందిందని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా వరకూ పూరి క్రేజ్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. విజయ్ ఆటలు పూరి దగ్గర సాగవు. పైగా.. ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ భాగమయ్యాడు. తెలుగు నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మైత్రీ వాళ్లు పది కోట్లు  ఖర్చుపెట్టారంటున్న మూవీ కూడా ఆపేశారని టాక్.

 

 

సీనియర్ హీరోలు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా ఒద్దికగా సినిమాలు చేస్తున్నారు. విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి ఫీవర్ లోనే కంటిన్యూ అవుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. సక్సెస్ కోసం ఎలాంటి కథలు ఎంచుకోవాలో మాత్రమే విజయ్ ఆలోచిస్తే మంచిదంటున్నారు. ఒక్క ఫ్లాప్ తోనే కెరీర్ టఫ్ పొజిషన్ లోకి వెళ్లిపోతున్న రోజులివి. పూరి సినిమాలోనైనా విజయ్ సొంత నిర్ణయాలకు పోకుండా ఉంటే విజయ్ ఫ్లాపుల నుంచి ఒడ్డున పడే అవకాశం ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: