ప్రముఖ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్‌ దబ్బో రతానీ తాజాగా పలువురు బాలీవుడ్‌ తారలతో 2020 క్యాలెండర్‌ ను రూపొందించారు. డబూ రత్నానీ 25 సంవత్సరాలుగా ఏటా సినీ తారలతో క్యాలెండర్‌ ను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా రూపొందించిన ఈ క్యాలెండర్‌ కోసం ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, విద్యాబాలన్‌, విక్కీ కౌశల్‌, సైఫ్‌ అలీఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతిసనన్‌, సన్నీలియోనీ, భూమి పెడ్నెకర్‌, కియారా అడ్వాణీ ఫొటోషూట్‌ లో పాల్గొన్నారు. వీరితోపాటు కొత్తగా అనన్యపాండే మొదటిసారి దబ్బో రతానీ క్యాలెండర్‌లో భాగమయ్యారు.

 

 

పోర్న్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ కూడా ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు డ‌బూ ర‌త్నానీ కేలండ‌ర్‌ పై అమ్మ‌డు ఫుల్లుగా అందాలు ఆర‌బోసింది. తాజాగా రిలీజ్ అయిన ఫోటోషూట్ సెగ‌లు పుట్టిస్తుంది. ఇప్పుడు స‌న్నీలియోన్ కూడా మ‌రోసారి ఇదే చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఇంకాస్త ఎక్కువగా అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ.

 

 

అయితే ఈ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీ లియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. సన్నీ ఫొటో షూట్ కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారట. ఆ సమయంలో కబీర్ సన్నీని నెంబర్ కావాలని అడిగారట. ముందు కబీర్ అడిగిన ప్రశ్నకు సన్నీ షాకైనప్పటికీ.. అతనికి తనదైన శైలిలో షాకిచ్చారు. 

 

 

కబీర్ బేడీ ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడు కాబట్టి ఆయన నెంబర్ అడిగినప్పుడు నెంబర్ ఇవ్వకపోతే బాగోదు. అలాగని తన నెంబర్ ఇవ్వడం సన్నీకి ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించి.. తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చారట. దాంతో కబీర్‌కి డబుల్ షాక్ తగిలినట్లు అయింది. ఈ విషయాన్ని పలు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: