సినిమాల్లో రాణించాలంటే సక్సెస్ తప్పనిసరి. సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, కమిట్ మెంట్, ప్రేక్షకుల్ని కట్టిపడేసే నటన, గ్లామర్.. ఇవన్నీ ఉండాల్సిందే. వీటన్నింటికీ ప్లస్ అవ్వాల్సింది అదృష్టం. ప్రస్తుతం ఇవన్నీ కలబోసుకుని టాలీవుడ్ లక్కీ చార్మ్ గా మారింది కన్నడ భామ రష్మిక మందన. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక ఈరోజు విడుదలైన భీష్మ సినిమాలో నితిన్ కు జోడీగా నటించింది. ఈ సినిమాకు ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ వస్తోంది. దీంతో రష్మిక టైమ్ స్టార్ట్ అయిందని అంటున్నారు.

 

 

రెండేళ్ల క్రితం ఛలోతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం సినిమా ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రష్మిక టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ అనే టాక్ వచ్చి ఏకంగా సూపర్ స్టార్ మహేశ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన అవకాశాలు పట్టేసింది. మహేశ్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయి ఈ ఏడాది తొలి హిట్ సాధించింది. ఇప్పుడు వెంటనే భీష్మతో మరో సూపర్ హిట్ కొట్టేసింది. దీంతో రష్మికకు ఇక తిరుగులేదనే టాక్ వస్తోంది. నితిన్రష్మిక కాంబో భీష్మ సినిమాకు హైలైట్ అంటున్నారు.

 

 

భీష్మ హిట్ తో రష్మిక కాల్షీట్స్ దొరకడం ఇక కష్టమే అంటున్నారు. గత ఏడాది విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ అయినా సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన హైప్ కు కారణం రష్మిక హీరోయిన్ కావడమే. విజయ్రష్మిక కాంబో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బన్నీతో చేస్తున్న సినిమాతోపాటు త్రివిక్రమ్ఎన్టీఆర్ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: