సినిమా ఇండస్ట్రీ అంటే ఎన్నో అవకతవకలు ఓడిడుగులు, కష్టాలను ఎదుర్కోవాలి అప్పుడే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. ఒక్కోసారి హిట్ అవుతుందన్న సినిమానే ఫ్లాప్ అవుతుంది. తెలుగులో సినిమాలు హిట్ కాకపోయినా కూడా సినిమాలో ఏదోకటి హైలెట్ గా నిలుస్తుంది. అందుకే తెలుగు సినిమాలు కలెక్షన్లను ఎక్కువగా వస్తాయి కూడా.. 

 


అయితే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు మేలని ఓ డైరెక్టర్ అంటున్నారు. వివరాల్లోకి వెళితే..  మలయాళం, తమిళ ఇండస్ట్రీలు వేస్ట్.. టాలీవుడే కింగ్ అంటున్నారు ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ. టాలీవుడ్‌ ముందు ఆ ఇండస్ట్రీలన్నీ తుస్సే అనేసారు. తమిళ ఇండస్ట్రీ కాస్త బెటర్ కానీ మలయాళం మాత్రం అందరూ పులిహారగాళ్లేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

 


ప్రస్తుతం అయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. నార్త్ ఇండియా వాళ్ళు కేవలం డబ్బు కోసం సినిమాలను చేస్తే... తెలుగు వాళ్ళు మాత్రం నటనను నిరూపించడానికి సినిమాలలో నటిస్తారని ఆయన అంటున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువ ఉండాలన్నా, మంచి ఫుడ్ తిన్నాలన్నా టాలీవుడే కింగ్. ఇప్పుడున్న కీర్తి సురేష్, సమంత, తమన్నాలకు తమిళం, మలయాళం వాళ్లు తెలుగు వాళ్లు ఇస్తున్నంత రెమ్యునరేషన్ ఇస్తారా? అస్సలు ఇవ్వలేరు. బాలీవుడ్ తర్వాత రిచెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే టాలీవుడే. తమిళం, కన్నడ ఇండస్ట్రీలు వేస్ట్. ఇక మలయాళం గురించి చెప్పాలంటే అక్కడంతా పులిహారగాళ్లే. 

 


ఇప్పుడు అక్కడ డిమాండ్ కూడా పెరిగింది. అల్లు అర్జున్ సినిమాల వల్ల. అల్లు అర్జున్ సినిమాలను ఎదో అలా ఆడిస్తూ చిత్ర దర్శకులు పబ్బం గడిపేస్తున్నారని ఆయన అన్నారు. నా సినిమాలో హీరోయిన్ అంటే కృతి అందాల మధ్య చూపిస్తుంటాను. హీరోకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు మంచి అందమైన అమ్మాయి దొరికితే చక్కటి హీరోను పెట్టి సినిమా తీయొచ్చు. అందమైన అమ్మాయిలు అంటే సౌందర్యలా కాదు.. కాజల్. ఇలియానా అంటే వాళ్ళు నా దృష్టిలో ఆంటీలు అని అన్నారు. ప్రస్తుతం వైరల్ గా ఈయన మాటలు మారాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: