తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ‘రాక్షసుడు’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.  తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన నిర్మాతగా మారారు.  అప్పట్లో రామ్ చరణ్ హీరోగా ‘ఆరెంజ్’ చిత్రం తెరకెక్కించి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాణ రంగం వైపు వెళ్లలేదు.  అంతలోనే జబర్ధస్త్ లో జడ్జీగా ఛాన్స్ వచ్చింది.  రోజా, నాగబాబు జడ్జీలుగా ఏడేళ్లు కొనసాగుతూ వచ్చారు.  ఈ మద్య నాగబాబు జబర్ధస్ నుంచి వైదొలగి.. జీ తెలుగు లోకి ‘అదిరింది ’ కార్యక్రమానికి జడ్జీగా వెళ్లారు.   అయితే గత ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 

 

ఆ తర్వాత అదిరింది కామెడీ షోకి జడ్జీగా వెళ్లారు.  అప్పుడప్పుడు రాజకీయ పరంగా కొంతమందిపై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.  తాజాగా 'ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌..' పాట వీడియోను పోస్ట్ చేస్తూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ పిలుపు ఎవరిది? ఎవరికోసం? విజేతలకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబడును' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత చలం, అంజిబాబు పాడే పాట   ‘చవటాయను నేను వట్టి చవటాయను నేను' అనే పాట వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

 

'ఎలక్షన్లలో రూ.లక్ష ఖర్చుతో ఎమ్మెల్యేనైపోయాను.. ఆ తర్వాత రూ.10 లక్షలు సంపాదించాను' అంటూ రాజకీయ ఈ పాట అప్పట్లో తెగ ఊపేసింది.  రాజకీయలపై సెటైర్ గా వచ్చిన ఈ పాటను పళ్లెటూళ్లలో కూడా బాగా పాడుకునే వారు.  ఎందుకో ఈ పాటలు గుర్తు కొచ్చాయంటూ నాగబాబు పేర్కొన్నారు.   నాగ బాబు ఏది చేసినా అందులో ఏదో ఒక మతలబు ఉంటుందనినెటిజన్లు అంటున్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'వైసీపీ ,టీడీపీ పార్టీ లో కేస్ లు ఉన్న నాయకులు అనుకుంటున్నాం అండీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: