టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, ఇంకే వుడ్ అయినా సరే సీనియర్ హీరోయిన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అనేది వాస్తవం. ముఖ్యంగా వారికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ కూడా దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటూ ఉంటాయి. వరుసగా సినిమాలు చేస్తూ, హిట్ కొట్టే హీరోయిన్లకు అయితే నిర్మాతలు అన్ని ఆఫర్లు ఇస్తూ ఉంటారు అనేది వాస్తవం. కోలీవుడ్ లో, బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోయిన్ల హవానే కొనసాగుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

నయనతార, కాజల్, సమంతా, అనుష్క, బాలీవుడ్ లో దీపిక, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ ఇలా వయసు మీద పడుతున్నా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ ఖర్చు దెబ్బకు నిర్మాతలు భయపడుతున్నారు. పారితోషకం ఆరు కోట్లకు పైగానే టాలీవుడ్ కోలీవుడ్ లో తీసుకుంటే, బాలీవుడ్ లో కనీసం 15 పైనే ఉంటుంది. ఇప్పుడు ఇదే నిర్మాతలను కంగారు పెడుతుంది. వాళ్లకు క్రేజ్ ఉంది సరే, నటన ఉంది సరే... కాని పారితోషకం అంత ఇచ్చి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

 

అది ఏంటీ అంటే.. ఒక స్టార్ హీరోయిన్ ఒక రోజు షూటింగ్ కి వస్తే... ఆమె ఖర్చులు, ఆమె బాయ్ ఫ్రెండ్ ఖర్చులు, ఆమె సహాయకుల ఖర్చులు, ఆమె తిండి ఖర్చు, హోటల్ ఖర్చు ఇలా ఏది చూసినా సరే రోజు కి 80 వేలకు పైమాటే. పారితోషకం అంత ఇచ్చి కూడా ఈ అదనపు  ఖర్చులు ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది నిర్మాతలను. సినిమా సరిగా ఉంటే ఏ హీరోయిన్ ఉన్నా ఆడతాయి గాని ఈ బాధ మాకు ఏంటీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. అందుకే ఇక నుంచి వాళ్ళ ఖర్చులు అన్నీ కూడా పారితోషకం నుంచే పెట్టాలని డిసైడ్ అవుతున్నారు దర్శక నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: