టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ తర్వాత నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాన్, ఎన్టీఆర్ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.   జూనియర్ ఎన్టీఆర్ అచ్చం తన తాత పోలికలతో ఉండటంతో ఈ ఎంగ్ హీరోకి అన్ని కలిసి వచ్చాయి.  స్టూడెంట్ నెం.1 తో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్ ఇప్పటికీ రాజమౌళితో మూడు సినిమాలు పూర్తి చేసి ప్రస్తుతం ఆర్ ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.  అయితే టెంపర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కి వరుసగా హిట్స్ పడుతున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ చివరి చిత్రం అరవింద సమేత. 

 

ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ కి కమిట్ కావడంతో ఆయన రెండేళ్ల వరకు ఈ మూవీకి కే పరిమితం అయ్యారు.  ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కమిట్ అయిన విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.  వాస్తవానికి ఎన్టీఆర్ తన బ్రదర్ కళ్యాన్ రామ్ బ్యానర్ లో నటించి మంచి హిట్ ఇస్తానని ఇప్పటికే ప్రకటించాడు.  గత కొంత కాలంగా కళ్యాన్ రామ్ వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నారు.  తన సొంత బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో నష్టాల బాట పట్టారు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంతో మంచి హిట్ అందించాడు. 

 

ఇప్పుడు త్రివిక్రమ్ తో మంచి హిట్ అందుకుంటే తన సోదరుడు కళ్యాన్ రామ్ కి బాసటగా నిలవాలనేదే తన స్కెచ్ అయి ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  ఏది ఏమైనా సొంత వారి కోసం ఎవరైనా ఏదైనా చేస్తారని ఎన్టీఆర్ నిరూపించాడు.  గతంలో ఆరెంజ్ చిత్రంతో భారీగా నష్టపోయిన మెగా బ్రదర్ నాగబాబు కి తన సోదరుడు పవన్ కళ్యాన్ బాసటగా నిలిచి ఎంతో సహాయం అందించారట. ఆ తర్వాత జబర్ధస్త్ తో నాగబాబు నష్టాల నుంచి కోలుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: