రెండు రోజులుగా తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో ఓ సినిమా టైటిల్ బాగా వైర‌ల్ అవుతోంది. రాధాకృష్ణ అనే పేరుతో తెర‌కెక్కే ఈ టైటిల్లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ‌త ఏడాది ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ అని రాంగోపాల్ వ‌ర్మ సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు ల‌క్ష్మీపార్వ‌తినే ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ‘రాధాకృష్ణ’ అనే పేరుతో సినిమా తీస్తుండ‌టం రాజ‌కీయంగాను, సినిమాల ప‌రంగాను సంచ‌ల‌నంగా మారింది.



రాధాకృష్ణ అనే టైటిల్ అన‌గానే ప్ర‌తి ఒక్క‌రికి ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ, ది గ్రేట్ జ‌ర్న‌లిస్ట్ వేమూరి రాధాకృష్ణ యేనా అన్న సందేహాలు త‌లెత్తుతున్నాయి. ఎత్తులు.. వేయ‌డంలో త‌న‌కు తానే సాటిగా అభివ‌ర్ణించుకునే రాధాకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న అయ్యాక అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఏపీలోనూ తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.



ఎప్పుడైతే తెలంగాణ ఎన్నిక‌ల్లో చివ‌ర్లో ఫ్లేటు ఫిరాయించి కేసీఆర్‌కు వ్య‌తిరేక‌మ‌య్యారో... ఇటు ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారో అప్ప‌టి నుంచి ఆర్కేకు చుక్క‌లే క‌న‌ప‌డుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌ను ప‌ద‌వి నుంచి దింప‌డంలో ఆర్కే పాత్ర కూడా ఉంద‌ని అప్ప‌ట్లోనే రాధాకృష్ణ‌పై ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే రాధాకృష్ణ పేరుతో తెర‌కెక్కే సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డంతో అంద‌రూ ఈ సినిమా కథేంటని ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు.



వాళ్లు ఏదో నిర్మ‌ల్ కొయ్య బొమ్మ‌ల స్టోరీ అని చెపుతున్నా మ‌న రాధాకృష్ణ గురించి మాత్రం ఎన్నిక‌థ‌ల‌తో అయినా సినిమాలు తీసుకోవ‌చ్చు. మ‌రి కొంద‌రు అయితే ఆర్‌కే సార్ జీవితంలో కూడా ప్రేమ క‌థ‌లు ఉండ‌వా? ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే అనే ప్రోగ్రాంలో ఆయ‌న ఎదుటి వాళ్ల‌ను గుచ్చి గుచ్చి అడిగేది ప్రేమ‌, పెళ్లి...ఎట్సెట్రా గురించే ఎక్కువ అడుగుతారు ?  క‌దా ? అని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: