నటులు వయసు మీద పడుతున్న కొద్దీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఆరోగ్యంగా ఇబ్బందులు రాకుండా 50 ఏళ్ళు దాటిన దగ్గరి నుంచి వ్యాయామాలు చేయడంతో పాటుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక గ్లామర్ ని కాపాడుకోవడానికి గాను చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నటిస్తూ ఉంటారు. ప్రస్తుత౦ టాలీవుడ్ లో 60 ఏళ్ళు దాటిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు ఉన్నారు. ఆరు పదుల వయసు దగ్గరలో బాలకృష్ణ ఉన్నారు. 

 

బాలయ్య వరుసగా సినిమాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత మూడో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది తొలి భాగంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనితో షూటింగ్ కూడా జాగ్రత్తగా చేస్తూనే వేగంగా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి యువకుడి పాత్రలో నటిస్తున్న నేపధ్యంలో ఆయన నటన ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

 

వయసు మీద పడిన హీరోలు యువకులుగా నటించడం చాలా కష్టం. యాక్షన్ సన్నివేశాల్లో అయితే డూప్ ల అవసరం చాలా వరకు ఉంటుంది. కాని ప్రస్తుతం చిరంజీవి అవేమి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నటన కోసం ఆయన దూకుడుగానే వెళ్తున్నారు. అభిమానులను మెప్పించడానికి ఆయన విన్యాసాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు కొరటాల శివ కూడా చిరంజీవి యాక్షన్ చూసి షాక్ అవుతున్నారట. చిరంజీవి ఉత్సాహం తో పాటుగా ఆయన ఏ సీన్ కి అయినా ఓకే చెప్పడం, పెద్దగా ఇబ్బంది పడకపోవడంతో కొరటాల కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: