సినిమాల్లో హీరోయిన్ గా నిలబడటం అనేది చాలా కష్టం. ఒక సినిమా హిట్ అయినా మరో కొత్త అమ్మాయి కనపడితే ఆ హీరోయిన్ ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు ఇలా కనుమరుగు అయిపోయిన వాళ్ళే మనకు ఎక్కువగా కనపడతారు. ఆమె ఎంత బాగా నటించినా ఎంత అందంగా ఉన్నా సరే ఎక్కువ కాలం సినిమాలు చేయడం అనేది చాలా కష్టం. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ల పరిస్థితి మరీ ఇబ్బందికరమే. చాలా మంది రంగుల ప్రపంచం మీద పిచ్చితో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.  అవకాశాల కోసం చూస్తున్నారు. 

 

దీనితో సీనియర్ హీరోయిన్లు చాలా మంది కనుమరుగు అయిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది హీరోయిన్లు కనీసం అవకాశాలు రాక ఇప్పుడు చాలా వరకు ప్రయత్నాలు చేయడం కూడా మానేశారు. అయితే కొంత మందికి మాత్రం సినిమాల మీద కాకపోయినా స్క్రీన్ మీద కనపడటం అనేది చాలా ఇష్టం. దీనితో యాడ్స్ అయినా చెయ్యాలని భావిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు గా కాజల్, తమన్నా వంటి వారు ఉన్నారు. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడు కనపడే వారు కొందరు ఉన్నారు. 

 

లక్ష్మీ రాయ్, ప్రణీత వంటి వారు ఈ మధ్య అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనితో వీళ్ళు బంగారం, చీరల యాడ్స్ చెయ్యాలని చూస్తున్నారు. ప్రస్తుతం తమన్నా బంగారం యాడ్ చేస్తుంది. కాజల్ కూడా కొన్ని యాడ్స్ లో చేస్తుంది. అదే విధంగా ప్రణీత చీరాల యాడ్ చేస్తుంది. లక్ష్మీ రాయ్ కూడా తమిళంలో కొన్ని యాడ్స్ చేస్తుంది. ఇలా అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న వారు అందరూ ఇదే ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్లకు యాడ్స్ అవకాశాలు అయినా వస్తాయో లేదో చూడాలి. వీరిలో తమన్నా అప్పుడప్పుడు సాంగ్స్ లో మెరుస్తుంది. కాజల్ కొన్ని సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: