తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు హీరో నాని.  భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత నాని కి వరుసగా అదృష్టంకలిసి వస్తుందనే చెప్పాలి. ఏకంగా ఆయన  నటించిన ఆరు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.  దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా నానికి మంచి క్రేజ్ దక్కింది.  ఆయనతో చిత్రాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అ! తో మంచి విజయం అందుకున్నాడు. ఓ వైపు హీరోగా మరోవైపు నిర్మాతగా తన సత్తాకొనసాగిస్తున్నాడు నాని.  తాజాగా ఆయన నిర్మాణంలో వస్తున్న ‘హిట్’ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ శైలేష్ ఈ క‌థ‌ను చెప్ప‌గానే.. వెంట‌నే చేయాల‌నిపించింది.

 

నేనే కాదు ఈ కథవింటే ఎవరికైనా మంచి ఉత్సాహం అనిపిస్తుంది.  ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ మూవీ కథ నడుస్తుంది. డైరెక్ట‌ర్ శైలేష్  ఇండస్ట్రీకి వ‌స్తానంటే ఎంక‌రేజ్ చేస్తూనే కొంచెం జాగ్ర‌త్త‌లు చెబుతూ వ‌చ్చాను. జాబ్ వ‌దిలి రాకు అని త‌న‌కు ఎప్పుడూ చెబుతుంటాను. ఈ చిత్రంలో శైలేష్ డైరెక్ట‌ర్‌గా ఎంటో నిరూపించుకుంటాడన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు.  ఈ చిత్రం చూస్తే ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ చేసినట్టు  అనిపించ‌దు. ఇక విశ్వ‌క్ గురించి చెప్పాలంటే.. హీరోగా విశ్వ‌క్‌ను అనుకుంటున్న‌ప్పుడు త‌న గురించి ఏం తెలియ‌దు. 

 

పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కాబ‌ట్టి త‌ను సూట్ అయిపోతాడ‌నిపించింది. ఈరోజు సినిమా చూసిన త‌ర్వాత త‌ను ఏ రోల్ అయిన ఇర‌గ‌దీస్తాడ‌నిపించింది.  విశ్వక్ లో మంచి ఫైర్ ఉంది.. అతను కూడా చాలా నాచురల్ గా కనిపిస్తున్నాడు. మంచి భవిష్యత్ ఉండబోతుందని అర్థం అవుతుంది.   ఇక హీరోయిన్  రుహాని చాలా బాగా చేసింది.   `హిట్` సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు నిర్మాత‌లు త‌ర‌పున థాంక్స్‌ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: