యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. పలు వాయిదాల అనంతరం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్దమయ్యారు. అప్పుడు కచ్చితంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెప్తుంది. 

 

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ సరసన అలియ బట్ నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అవ్వగానే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా టైటిల్ కూడా దాదాపుగా ఖరారు అయింది అంటున్నారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని త్రివిక్రమ్ ఖరారు చేసాడని అంటున్నారు. ఈ ఏడాది మే లో ఈ సినిమా షూటింగ్ మొదలై వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. 

 

ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. రష్మిక మంధనా అని కాసేపు, పూజ హెగ్డే అని కాసేపు అంటున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినపడుతుంది. గతంలో ఎన్టీఆర్ సరసన నటించిన అక్కినేని వారి కోడలు.. 'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా', 'రభస', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో వీరు కలిసి నటించారు. ఈ సినిమాల్లో రెండు ఫ్లాప్ అవగా రెండు సినిమాలు బోల్తా పడ్డాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతా చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమాకు ఆమెను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: