మాములుగా టాలీవుడ్ లో అగ్ర హీరోలు మధ్య ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగులో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న ఆ ఇద్దరు మధ్య వార్ కొనసాగుతుందట  ఒకరేమో వరస విజయాలతో దుమ్ములేపి స్టార్ అయ్యాడు.  ఈమధ్య ఫ్లాపులు వస్తున్నాయి. మరొకరేమో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్టుగా అనతికాలంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ క్రేజీ హీరో దెబ్బకు ముందుగా మీడియం రేంజ్ హీరోల్లో టాప్ అనిపించుకున్న హీరో స్థానానికి ఎసరు వచ్చింది. 

 

 


అయితే ఈ ఇద్దరు పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ నటిస్తున్నారు. నిజానికి ఇద్దరికీ సీ సెంటర్లలో మార్కెట్ లేదు. ఆ క్రేజీ హీరోకు సీ తో పాటు బీ సెంటర్లలో కూడా వీకే.  అయితే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా లేని ఈ హీరోలు బయట మాత్రం లేనిపోని హైప్ సృష్టిస్తున్నారట.  ఈ ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ అంటూ కృత్రిమంగా ఈ హడావుడి చేయిస్తున్నారట.


 

ఆ క్రమంలో కొందరి వ్యక్తులను పెట్టి మరి ఫెక్ వాళ్ళను పబ్లిసిటీ చేయిస్తున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఈగో క్లాషెస్ వచ్చాయని అంటున్నారు. ఆ క్రేజీ హీరో సినిమా ఈమధ్య బోల్తా కొట్టడంతో మరో హీరో.. ఆయన టీమ్ బోల్తా పండగ జరుపుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  

 

 


ఈ కోల్డ్ వార్ సంగతి తెలిసిన ఇండస్ట్రీ సీనియర్లు కథలపై.. నటనపై దృష్టి పెట్టకుండా ఈ చెత్తపనులు ఎందుకని అంటున్నారు.  ఈ మీడియం రేంజ్ హీరోలకు ఆ విషయం ఎప్పుడు అర్థం అవుతుందో.. ఎప్పుడు ఈ ఫేక్ రచ్చలను వదిలిపెట్టి టాప్ రేంజికి వెళ్తారో మరి.ఇలా గొడవలతో రూమర్లతో కానిస్తారో చూడాలి.. మరి సినిమాల విషయానికొస్తే సినిమాలు ఎలా రాణిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: