విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను చంపేస్తాము అంటూ ఈమధ్య కర్ణాటక లోని కొన్ని మత తత్వ సంస్థలు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ లాంటి హేతువాద దృష్టితో ఉండే కొందరు ప్రముఖులను కర్ణాటక లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు హత్య చేయడంతో ప్రకాష్ రాజ్ అభిమానులు ఆయన సెక్యూరిటీ గురించి బెంగ పెట్టుకున్నారు.


వాస్తవానికి ప్రకాష్ రాజ్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాష్ రాజ్ బద్రత గురించి పట్టించుకుంటుంది అని భావించారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ప్రకాష్ రాజ్ గురించి పట్టించుకొకపోవడంతో ఆయన బద్రతకు సంబంధించిన బాధ్యతను తాము పట్టించుకుంటాము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకాష్ రాజ్ కు చెప్పినట్లు సమాచారం.  


ఈ విష‌యాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ మీడియాకు లీక్ చేసాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు తనకు బద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పినా తాను సున్నితంగా తిరస్కరించానని అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా సెక్యూరిటీని పెట్టుకోవాల‌ని సూచించారని ప్రకాష్ రాజ్ లీకులు ఇస్తున్నాడు. 

 

అంతేకాదు త‌న లా కాస్త పేరు ఉన్న‌వాడిని చంప‌డం అంత సులువు కాదని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడుతున్నాడు. అయితే సామాన్యుల్లో ఎవ‌రైనా ఎదురు ప్ర‌శ్నిస్తే మాత్రం సుల‌భంగా చంపేస్తున్నార‌ని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఓడిపోయినా ప్రకాష్ రాజ్ ఇంకా రాజకీయాలలో కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి అతడు చేసిన కృషికి అందరి ప్రశంసలు లభించాయి. ఆ మధ్య ప్రకాష్ రాజ్ టిఆర్ఎస్ లో చేరుతాడు అంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈసారి ప్రకాష్ రాజ్ తన రాజకీయ అదృష్టాన్ని తెలంగాణ ప్రాంతం నుండి పరీక్షించుకునే ఆస్కారం ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: