ఇండియన్ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ చేయని పాత్రలు లేవు అనేది వాస్తవం. ఎన్నో పాత్రల్లో ఆయన జీవించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు భారతీయ వెండి తెర మీద ఇంకా ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన కెరీర్ ఆసాంతం యాక్షన్, లవ్, విభిన్న పాత్రలు, పవర్ ఫుల్ పాత్రలు ఇలా కమల్ చేయనివి లేవు. సినిమా హిట్ అయినా సరే కమల్ మాత్రం ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదని అంటారు. తాజాగా ఆయన నటించిన ఒక సినిమా గురించి సీనియర్ నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

 

ఒక ఇంటర్వ్యులో వారిద్దరూ కలిసి నటించిన సినిమా గురించి చెప్పారు ఆమె. రేఖ, కమల్ హాసన్ జంటగా 1986లో ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా ఒకటి విడుదల అయింది. ఈ సినిమాలో  కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమ కథకు ఇంట్లో వాళ్ళ అంగీకారం ఉండదు. దీనితో వాళ్ళు చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. పున్నగాయ్ మన్నన్ సినిమాకు కే. బాలచందర్ దర్శకత్వం వహించారనిమేం సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా కమల్ హాసన్ ముద్దు పెట్టేసారని గుర్తు చేసుకున్నారు. 

 

ఆయన కావాలని చేసింది కాదు అని నాకు తెలుసన్న ఆమె, కానీ ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ కమల్ హాసన్ కానీ ముందే చెప్పాలి కదా...? వాళ్లు చెప్పలేదని, నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చిందన్నారు. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి వద్దకు వెళ్లి ఇదే విషయం గురించి అడిగానని... అందుకు ఆయన ఏమన్నారో తెలుసా...? ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? అని ప్రశ్నిస్తూ... ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందే అన్నారట. కానీ ఆ సీన్ తర్వాత నాకు కొన్ని రోజుల పాటు నిద్ర లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: